Begin typing your search above and press return to search.

జీవితంలో ఒకసారే ఇలాంటి అవ‌కాశం వ‌స్తుంది: దేవీశ్రీ ప్ర‌సాద్

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం `సింగ్ గీతం`.

By:  Sivaji Kontham   |   6 Jun 2026 12:36 AM IST
జీవితంలో ఒకసారే ఇలాంటి అవ‌కాశం వ‌స్తుంది: దేవీశ్రీ ప్ర‌సాద్
X

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం `సింగ్ గీతం`. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడ‌మే గాక కీల‌క పాత్ర‌లో న‌టించారు. జూన్ 11న సినిమా విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా తాజా ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను దేవీశ్రీ చెప్పుకొచ్చారు.

**లెజెండ‌రీ సింగీతం శ్రీనివాసరావుతో సినిమా అనగానే మీ ఫీలింగ్?

నేను సింగీతం గారికి వీరాభిమానిని. ఆయన లెజెండ్. ఏళ్ల క్రితం ఆయన మా స్టూడియోకు వచ్చి ‘సింగ్ గీతం’ ఐడియా చెప్పినప్పుడు చాలా థ్రిల్‌గా అనిపించింది. మూడేళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన నుంచి ఫోన్ వచ్చినప్పుడు, ఏడాది క్రితం నాగ్ అశ్విన్ సార‌థ్యంలో వైజయంతి మూవీస్‌తో కలిసి ఈ సినిమా పట్టాలెక్కినప్పుడు చాలా ఆనందం క‌లిగింది. సింగీతంకు ఒక ట్రిబ్యూట్‌లా ఆయనతో పనిచేయడం ఒక బ్లెస్సింగ్‌లా భావిస్తున్నాను.

** సింగీతం చాలా ఏళ్ల క్రితమే ఈ కథ అనుకున్నారు కదా... ఇప్పటికీ ఈ కథ ఎంత రిలెవెంట్‌గా ఉంటుంది?

సింగీతం ఆలోచనలు ఎప్పుడూ గ‌తంలో రానివి.. మునుముందు కూడా రాని విధంగా కొత్తగా ఉంటాయి. కళ, సంగీతానికి సంబంధించిన అంశాలు ఎప్పటికీ పాతబడవు. ఒక గ్రామం మొత్తం మాట్లాడలేక, కేవలం పాటల రూపంలోనే సంభాషించే కథ ఇప్పటివరకు రాలేదు. ఇది కేవలం కామెడీ సినిమా కాదు.. ఇందులో అద్భుతమైన భావోద్వేగాలు కూడా ఉన్నాయి.

**మాటలన్నీ పాటలుగా చేశారు కదా... ఆ అనుభవం గురించి?

ఇది నా కెరీర్‌లో అత్యంత ఛాలెంజింగ్ సినిమా. ప్రతి డైలాగ్‌ను సంగీతంగా మార్చాల్సి వచ్చింది. చిన్నప్పటి నుండి న్యూస్‌పేపర్ వార్తలను ట్యూన్స్‌గా మార్చే అలవాటు ఈ సినిమాకు ఉపయోగపడింది. ఒక సీన్ మ్యూజికల్‌గా చేసి వినిపిస్తే, ``మనకు కావాల్సిన మ్యూజిక్ ఇదే`` అని సింగీతం మెచ్చుకోవడం పెద్ద కాంప్లిమెంట్. ప్రతిదీ ముందుగానే మ్యూజికల్‌గా చేసి ఇవ్వగా.. దాని ఆధారంగా షూట్ చేశారు. డైలాగ్ మారితే స్కేల్ మారిపోతుంది కాబట్టి ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. జీవితంలో ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు.

**సినిమా చూసుకున్నాక మీకు ఎలా అనిపించింది?

సినిమా చూస్తున్నప్పుడు సింగీతం విజన్‌కి మరోసారి ముగ్ధులమైపోయాం. ఇది నాకు ఎంతో ప‌నిప‌రంగా సంతృప్తిని ఇచ్చిన ప్రాజెక్ట్. ప్రతి డైలాగ్ మ్యూజికల్‌గా ఉన్నా చాలా సహజంగా అనిపిస్తాయి. కొంతసేపటి తర్వాత పాటలు వింటున్నారనే విషయమే మర్చిపోయి ఆ గ్రామంలో భాగమైపోతారు.

**ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది?

ఒక విభిన్నమైన సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. 94 ఏళ్ల వయసులో సింగీతం చేసిన ఈ ప్రయత్నం అందరికీ స్ఫూర్తినిస్తుంది. కమల్ హాసన్ గారు సినిమా చూసి, ``ఇలాంటి సినిమాలో నేను కూడా భాగం కావాల్సింది`` అనడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

**ఎల్లమ్మ' గురించి?

చాలా పని పూర్తయింది. కొన్ని పాటలు, ఒక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశాను. దిల్ రాజు ప్లానింగ్ ప్రకారం మ్యూజిక్, నటనపై దృష్టి పెడుతున్నాం. ఇది రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ...