Begin typing your search above and press return to search.

సింగ్‌గీతం.. కలెక్షన్లు పెరుగుతున్నాయహో

94 ఏళ్ల వయసున్న ఒక దర్శకుడు సినిమా తీశాడంటే.. అదేదో పాత కాలం సినిమా అయి ఉంటుందని.. ఔట్ డేటెడ్ కంటెంట్ ఉంటుందని అనుకుంటారు ఎవరైనా.

By:  Garuda Media   |   14 Jun 2026 1:22 AM IST
సింగ్‌గీతం.. కలెక్షన్లు పెరుగుతున్నాయహో
X

94 ఏళ్ల వయసున్న ఒక దర్శకుడు సినిమా తీశాడంటే.. అదేదో పాత కాలం సినిమా అయి ఉంటుందని.. ఔట్ డేటెడ్ కంటెంట్ ఉంటుందని అనుకుంటారు ఎవరైనా. కానీ పాతికేళ్ల కుర్ర డైరెక్టర్లకు దీటుగా, ఇంకా చెప్పాలంటే వాళ్లను మించి నిత్య నూతనంగా ఆలోచించగలనని చాటిచెప్పారు సింగీతం శ్రీనివాసరావు. చాలా వరకు మూసలో కొట్టుకుపోయే తెలుగు సినిమాల్లో.. సింగీతం రూపొందించిన ‘సింగ్ గీతం’ ఎంతో కొత్తగా సాగే, అద్భుతమైన ప్రయోగం అనడంలో సందేహం లేదు.

భూమి లోపలున్న బంగారం కోసం ఆశపడి.. భూమి మీద ఉన్న ప్రకృతి అనే బంగారాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నమనే అంశాన్ని వెరైటీ నరేషన్‌తో ప్రెజెంట్ చేశారు సింగీతం. డైలాగ్స్ బదులు పాటలు వినిపించే ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతోంది. ఐతే ఈ సినిమాకు రిలీజ్ ముంగిట పెద్దగా బజ్ కనిపించలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేవు.

రిలీజ్ ముందు రోజు చాలా షోల ఆక్యుపెన్సీలు చూస్తే.. అసలు బొమ్మ పడుతుందా అనే సందేహాలు కలిగాయి. థియేటర్లలో షో మొదలయ్యే సమయానికి మినిమం ఆక్యుపెన్సీలు లేకపోత షోలే వేయరన్న సంగతి తెలిసిందే. ఐతే ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రిమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడం.. నిన్న రిలీజ్ రోజు రివ్యూలన్నీ కూడా పాజిటివ్‌గానే ఉండడంతో ‘సింగ్ గీతం’ కథ మారింది. ఈవెనింగ్ షోల నుంచి సినిమాకు ఆక్యుపెన్సీలు పెరిగాయి.

ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో నైట్ షోలు జనాలతో కళకళలాడాయి. మౌత్ టాక్ జనాలకు బాగానే రీచ్ అయింది. సినిమా చూసిన వాల్లు కూడా సోషల్ మీడియాలో ‘సింగ్ గీతం’ను బాగా పుష్ చేస్తున్నారు. దీంతో తొలి రోజుతో పోలిస్తే శని, ఆదివారాల్లో వసూళ్లు ఇంకా మెరుగ్గా ఉండే సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి సింగీతం కలల ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి ఎంతో శ్రమించిన నాగ్ అశ్విన్ అండ్ టీం కష్టానికి మంచి ఫలితమే దక్కేలా కనిపిస్తోంది.