ఒకప్పటి 'బతుకమ్మ' హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూసారా?
అయితే మరికొంతమందికి అందం ,అభినయం, ప్రతిభ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎందుకో ఇండస్ట్రీ కలిసి రాక దూరమవుతూ ఉంటారు.
By: Madhu Reddy | 17 Oct 2026 2:00 PM ISTదీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఎంతోమంది హీరోయిన్లు.. ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోలకి ఇండస్ట్రీలో ఉండే లైఫ్ టైం కంటే హీరోయిన్స్ కి చాలా తక్కువ. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ భవిష్యత్తులో కూడా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా అవకాశాలు చేయిజార్చు కోనివ్వకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉంటారు. అయితే మరికొంతమందికి అందం ,అభినయం, ప్రతిభ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎందుకో ఇండస్ట్రీ కలిసి రాక దూరమవుతూ ఉంటారు.
అయితే సడన్గా ఎప్పుడైనా సోషల్ మీడియా ద్వారా లేదా ఏదైనా ఫంక్షన్ లో కనిపిస్తే అభిమానులు వాళ్ళని చూడడానికి తెగ ఆసక్తి కనపరుస్తారనడంలో సందేహం లేదు. అలాంటి వారిలో బతుకమ్మ హీరోయిన్ సింధు తులాని కూడా ఒకరు. ఒకప్పుడు నవదీప్ తో గౌతం ఎస్ఎస్సి సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకొని కుర్రకారు క్రష్ గా పేరు సొంతం చేసుకున్న సింధుతులాని.. ఆ తర్వాత అతనొక్కడే, బతుకమ్మ , మన్మధ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈమె ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది.
అయితే చాలా కాలం తర్వాత తన పెళ్లి రోజు సందర్భంగా షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ముఖ్యంగా తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను, పెళ్లిరోజు సందర్భంగా సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలతో పాటు కారు కొనుగోలు చేసినట్టు అభిమానులతో పంచుకుంది. మొత్తానికి అయితే చాలా కాలం తర్వాత మళ్లీ దర్శనం ఇవ్వడంతో సింధుతులాని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే 2017లో తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ చిత్రాంగద లో చివరిసారిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె మళ్లీ గత ఏడాది ఉపేంద్ర, రామ్ పోతినేని కీలకపాత్రలు పోషించిన ఆంధ్ర కింగ్ తాలూకాలో ఉపేంద్ర భార్యగా నటించింది.
ఇక ఆ సమయంలో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ మళ్ళీ ఏడాది తర్వాత తన పెళ్లి సందర్భంగా ఫోటోలు షేర్ చేయడంతో అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా సింధుతులాని మళ్లీ మంచి మంచి అవకాశాలు అందుకొని ఇండస్ట్రీలో నాటి వైభవాన్ని అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
1982 సెప్టెంబర్ 28న ముంబై మహారాష్ట్రలో జన్మించిన ఈమె.. ఉత్తరాదిలో ఫెయిర్ అండ్ లవ్లీ క్రీం మోడల్గా పనిచేసింది.. 2003లో ఐతే అనే తెలుగు చిత్రం ద్వారా తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఆ తర్వాత ధనుష్ సరసన సుల్లన్ అనే చిత్రంలో తమిళ్ అరంగేట్రం చేసింది. ఆ తర్వాత మజా అనే చిత్రంలో విక్రమ్ తో కలిసి ఒక ఐటెం నెంబర్లో కూడా నటించిన విషయం తెలిసిందే.. అలా ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
