బెడ్ మీద అలాంటి ఫోజులతో గత్తర లేపిన సిమ్రాన్ చౌదరి ఫోటోలు వైరల్!
ఈ క్రమంలోనే మరొక అందాల తార కూడా తాజాగా ఉదయాన్నే బెడ్ పై నుండి కొన్ని గ్లామర్ ఫోటోలను పంచుకుంది.
By: Madhu Reddy | 13 April 2026 2:16 PM ISTసోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు తమ ఉనికిని చాటుకోవడానికి తెగ పరితపిస్తున్నారు. ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే.. మరొకవైపు ఇంస్టాగ్రామ్ వేదికగా అందాలు ఆరబోస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమయం సందర్భం లేకపోయినా సరే అందంగా ముస్తాబయ్యి.. కొంత మంది తమ ఫోటోలను షేర్ చేస్తే.. మరికొంతమంది ఉదయం బెడ్ పైనుంచి రాత్రి మళ్ళీ బెడ్ పైకి చేరేవరకు ఏమేం చేస్తున్నారు అనే ప్రతి విషయాన్ని కూడా ఫోటోల రూపంలో బంధించి సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే మరొక అందాల తార కూడా తాజాగా ఉదయాన్నే బెడ్ పై నుండి కొన్ని గ్లామర్ ఫోటోలను పంచుకుంది. వైట్ నైటీలో అందాలు ఆరబోస్తూ బెడ్ పై వెల్లకిలా పడుకొని , బోర్లా పడుకొని ఇలా కొన్ని రకాల ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు పలు రకాల కామెంట్ చేస్తున్నారు. ఉదయాన్నే ఇలాంటి పోజులతో ఫోటోలు షేర్ చేయడంతో సిమ్రాన్ చౌదరి పై అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.
1996 జూలై 17న తెలంగాణ హైదరాబాదులో జన్మించిన ఈమె 12 సంవత్సరాల వయసులోనే కమర్షియల్ యాడ్స్ లో నటించి సంపాదించడం మొదలుపెట్టింది. అలా స్క్రీన్ పై కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.. ఇక 2012లో మిస్ ఆంధ్ర ప్రదేశ్ గా టైటిల్ ను సొంతం చేసుకున్న సిమ్రాన్ చౌదరి.. టాలీవుడ్ మిస్ హైదరాబాద్ 2017లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ అవార్డులను కూడా సొంతం చేసుకుంది.
మిస్ ఆంధ్ర ప్రదేశ్ , టాలీవుడ్ మిస్ హైదరాబాద్ టైటిల్స్ ని సొంతం చేసుకున్న తర్వాత 2014లో హమ్ తుమ్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఆపిల్ స్టూడియోస్ బ్యానర్ పై ఎం శివరామిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకి రామ్ భీమన దర్శకత్వం వహించారు. మనీష్, సిమ్రాన్ చౌదరి, నిఖిల్ చక్రవర్తి , ఐశ్వర్య, ఎమ్మెస్ నారాయణ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా అప్పట్లో పరవాలేదు అనిపించుకుంది. ఇక తర్వాత 2018 లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది సిమ్రాన్. ఇక తర్వాత చెక్, పాగల్ , సెహరి, అధర్వ , ఆ ఒక్కటి అడక్కు, లవ్ మీ, వనవీర వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇక ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది రిపీట్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమైంది సిమ్రాన్.
