Begin typing your search above and press return to search.

చీరకట్టులో గిలిగింతలు పెడుతున్న సిమ్రాన్ చౌదరి!

తాజాగా చీరకట్టులో కనిపించి అబ్బురపరిచింది. వైట్ కలర్ బ్లౌజ్.. ఆపోజిట్ బ్లూ కలర్ సారీ ధరించిన ఈమె వర్షాకాలపు అందాలను ఆస్వాదిస్తూ ఫోటోలను షేర్ చేసింది.

By:  Madhu Reddy   |   9 Oct 2025 5:00 PM IST
చీరకట్టులో గిలిగింతలు పెడుతున్న సిమ్రాన్ చౌదరి!
X

కాస్త సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో అలా వాలిపోతూ తమ అందమైన ఫోటోలతో అభిమానులకు మంచి అందాల బిందు వడ్డిస్తున్నారు గ్లామర్ బ్యూటీస్. ఒక్కొక్కసారి చీరకట్టులో చాలా సాంప్రదాయంగా కనిపించే వీరు.. మరొకసారి చిట్టిపొట్టి దుస్తులు వేస్తూ గ్లామర్ తో ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు కొంతమంది సినిమాలలో అవకాశాల కోసం ఇలా పాపులారిటీ దక్కించుకోవడానికి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే.

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సోషల్ మీడియాలో ఎవరికైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారో వారికే దర్శక నిర్మాతలు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు అని ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో, యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారా అనే అభిప్రాయాలు కూడా నెటిజన్స్ నుంచి వ్యక్తం అవుతున్నాయి.

అలా ఎప్పుడూ తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే సిమ్రాన్ చౌదరి కూడా మరొకసారి ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేసింది. తాజాగా చీరకట్టులో కనిపించి అబ్బురపరిచింది. వైట్ కలర్ బ్లౌజ్.. ఆపోజిట్ బ్లూ కలర్ సారీ ధరించిన ఈమె వర్షాకాలపు అందాలను ఆస్వాదిస్తూ ఫోటోలను షేర్ చేసింది. ప్రకృతి మధ్య లేడిలా ఫోటోలకు ఫోజులిచ్చింది. నడుము వయ్యారాలను హైలెట్ చేస్తూ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

తెలంగాణ, హైదరాబాదులో పుట్టి పెరిగిన సిమ్రాన్ చౌదరి డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. హైదరాబాదులోనే సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి డిగ్రీ పట్టా అందుకున్న ఈమె.. మోడల్గా తన కెరీర్ ను ప్రారంభించింది. అయితే 2014లోనే తెలుగు చిత్రం 'హమ్ తుమ్' అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత తొలిసారి 2017లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ టైటిల్ ను సొంతం చేసుకుంది.

అలాగే మిస్ టాలెంటెడ్ టాలీవుడ్, మిస్ హైదరాబాద్ టైటిల్స్ ని కూడా సొంతం చేసుకుంది. 2018లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' అనే సినిమాతో వెలుగులోకి వచ్చిన ఈమె.. 2020లో బాంబాత్ అనే సినిమాలో మాయా పాత్ర పోషించింది. అలా తనిఖీ, పాగల్, ఆ ఒక్కటి అడక్కు అంటూ పలు చిత్రాలు చేసింది సిమ్రాన్ చౌదరి. చివరిగా అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన 'లవ్ మీ' అనే సినిమాలో హీరోయిన్గా నటించింది ఈ సినిమా గత ఏడాది 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.