జారిపోతున్న డ్రెస్ లో కాక రేపుతున్న సిమ్రాన్!
అలా సిమ్రాన్ చౌదరి 2014లోనే హమ్ తుమ్ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా.. ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపు లభించింది.
By: Madhu Reddy | 12 Jun 2026 12:05 PM ISTతరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మాణంలో 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఈ నగరానికి ఏమైంది?. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న సిమ్రాన్ చౌదరి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఈ సినిమా విమర్శకుల నుండి ప్రశంసలు అందుకోవడమే కాదు ఇందులోని నటీనటులు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. అలా సిమ్రాన్ చౌదరి 2014లోనే హమ్ తుమ్ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా.. ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపు లభించింది.
ఈ చిత్రం తర్వాత పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ రోజుకొక లేటెస్ట్ ట్రెండీ ఔట్ఫీట్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఔట్ఫిట్ తో ఆడియన్స్ హృదయాలను దోచడానికి సిద్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా రఫ్ఫుల్స్ కలిగి శరీరానికి చక్కగా సరిపోయే బాడీ ఖాన్ మినీ రెడ్ కలర్ డ్రెస్ ధరించి తన అందాలతో ఆకట్టుకుంది . ముఖ్యంగా ఈ మినీ డ్రెస్ లో అమ్మడి గ్లామర్ డోస్ కి యువత ఫిదా అవుతున్నారు. పైగా ఒకపక్క స్లీవ్ లెస్ స్ట్రాప్ భుజం నుండి జారిపోతున్నట్టుగా ఉన్న ఈ డ్రెస్ చూపురులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
తన శరీర ఆకృతికి పర్ఫెక్ట్ గా సరిపోయే ఈ బాడీ కాన్ మినీ స్లిప్ డ్రెస్ ఈమె అందాన్ని రెట్టింపు చేసిందని చెప్పవచ్చు. ఇకపోతే సిమ్రాన్ చౌదరి ఇంత యంగ్ గా, పర్ఫెక్ట్ గా కనిపించడానికి కారణం ఏమిటి? ఈమె ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఎప్పటికప్పుడు ఆసక్తి కనపరుస్తూ ఉంటారు. మరి సిమ్రాన్ చౌదరి పర్ఫెక్ట్ ఫిగర్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
మిస్ ఇండియా తెలంగాణ 2017 టైటిల్ విన్నర్ సిమ్రాన్ చౌదరి.. టైటిల్ అందుకున్న తర్వాత తెలుగు సినిమాలలో అవకాశాలు అందుకోవడం మొదలుపెట్టింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. అంతకుముందు హమ్ తుమ్ అనే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత నితిన్ చెక్ , విశ్వక్ సేన్ పాగల్ ,అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు సినిమాల్లో అతిథి పాత్రలు చేసిన సిమ్రాన్ చౌదరి.. సెహరి , బొంభాట్, అథర్వ వంటి సినిమాలలో హీరోయిన్గా సందడి చేసింది.
ఈ ఏడాది ఒకటవ జనవరి 1న వచ్చిన వనవీర చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది సిమ్రాన్ చౌదరి. ఇకపోతే సైజ్ జీరో మైంటైన్ చేసే హీరోయిన్లలో ఒకరిగా పేరు దప్పించుకున్న ఈమె.. నిత్యం యోగ, ఫిలాటీస్ ,జిమ్లో వర్కౌట్ కూడా చేస్తూ ఉంటుంది. ఇక 1996 జూలై 17న జన్మించిన ఈమె హైదరాబాద్ లోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్టులలో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఈమె మోడల్, నటి మాత్రమే కాదు కూచిపూడి డాన్సర్ కూడా.
