Begin typing your search above and press return to search.

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో అలరిస్తున్న సిమ్రాన్ చౌదరీ.. ఫోటోలు వైరల్!

ఇదిలా ఉండగా నిన్నటికి నిన్న సాక్షి మాలిక్ షర్ట్ బటన్స్ విప్పి మరీ లో అందాలు చూపిస్తూ అభిమానులకు చెమటలు పట్టించింది.. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో కుర్ర హీరోయిన్ కూడా వచ్చి చేరింది. ఆమె ఎవరో కాదు సిమ్రాన్ చౌదరి.

By:  Madhu Reddy   |   6 Oct 2025 3:21 PM IST
బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో అలరిస్తున్న సిమ్రాన్ చౌదరీ.. ఫోటోలు వైరల్!
X

ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోయిన్లు చేస్తున్న పనులు చూస్తుంటే.. కొత్త ట్రెండ్ మొదలయ్యిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న హీరోయిన్స్.. ఇప్పుడు ఓపెన్ షర్ట్ ఛాలెంజ్ తీసుకున్నారేమోనని అనిపించక మానదు అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నిన్నటికి నిన్న సాక్షి మాలిక్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో గ్లామర్ తో అభిమానులను ఆకట్టుకుంది.. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో కుర్ర హీరోయిన్ కూడా వచ్చి చేరింది. ఆమె ఎవరో కాదు సిమ్రాన్ చౌదరి.

ప్రస్తుత కాలంలో అడపాదడపా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు ఆడియన్స్ ని పలుకరించే ఈమె.. తాజాగా ఈ కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతోందేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫాలోవర్స్. విషయంలోకి వెళ్తే తాజాగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు షేర్ చేసిన సిమ్రాన్ చౌదరి.. జీన్స్ ప్యాంట్, షర్ట్ తో కనిపించింది. అంతేకాదు మత్తెక్కించే కళ్ళతో.. వివిధ భంగిమలతో వయ్యారంగా ఫోటోలకు ఫోజులిస్తూ.. తన అందాలతో ఫాలోవర్స్ కి గిలిగింతలు పెడుతోంది. మొత్తానికైతే సిమ్రాన్ చౌదరి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఈ ఫోటోలు చూసిన ఫాలోవర్స్ బాబోయ్ ఇంత అందాలు తట్టుకోవడం కష్టం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సిమ్రాన్ చౌదరి కెరియర్ విషయానికి వస్తే.. 1996 జూలై 17న హైదరాబాదులో జన్మించింది. హైదరాబాదులోని డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో పదవ తరగతి , సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేసింది. సిమ్రాన్ 12 ఏళ్ల వయసులోనే కమర్షియల్ యాడ్స్ లో నటించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. 2012లో మిస్ ఆంధ్ర ప్రదేశ్ టైటిల్ అందుకున్న సిమ్రాన్ చౌదరి.. అదే ఏడాది టాలీవుడ్ మిస్ హైదరాబాదుగా కూడా కిరీటాన్ని అందుకుంది. 2017లో సెమినా మిస్ ఇండియా తెలంగాణ అవార్డులను కూడా దక్కించుకుంది.

మోడలింగ్ లో సత్తా చాటి పలు అవార్డులు అందుకున్న సిమ్రాన్ చౌదరి.. తొలిసారి 2014లో వచ్చిన 'హమ్ తుమ్' అనే తెలుగు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది, బొంభాట్, చెక్, పాగల్, సెహారి, అధర్వ, ఆ ఒక్కటి అడక్కు వంటి చిత్రాలలో నటించిన ఈమె.. చివరిగా లవ్ మీ అనే సినిమాలో కనిపించింది. దాదాపు తెలుగు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా అవినాష్ తిరువీధుల తో కలిసి ఒక కొత్త సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు గత ఏడాదే పూర్తయ్యాయి.

ఈ సినిమాలో అవినాష్ తిరువీధుల హీరోగా.. సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ సినిమాస్, ఎల్ఎల్బీ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కార్తీ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.