బాలీవుడ్ పై స్టార్ సీనియర్ హీరోయిన్ అసహనం.. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏం లాభం!
నార్త్ ఇండస్ట్రీలో తన సినీ కెరీర్ ని మొదలు పెట్టిన సిమ్రాన్ నార్త్ కంటే ఎక్కువగా సౌత్ ఇండస్ట్రీలోనే ఫేమస్ అయ్యింది.
By: Madhu Reddy | 26 Aug 2025 12:57 PM ISTనార్త్ ఇండస్ట్రీలో తన సినీ కెరీర్ ని మొదలు పెట్టిన సిమ్రాన్ నార్త్ కంటే ఎక్కువగా సౌత్ ఇండస్ట్రీలోనే ఫేమస్ అయ్యింది. అయితే అలాంటి సిమ్రాన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు మూడు దశాబ్దాలు అవుతోంది. ఈ 30 ఏళ్ల తన సినీ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. ఇండస్ట్రీ నుండి ఎంతో నేర్చుకుంది కూడా..అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాను ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ సినిమా వాళ్లకే తన పనితనం ఏంటో తెలియదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ఇంతకీ సిమ్రాన్ బాలీవుడ్ పై ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేసింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇన్నేళ్లయినా నా పనితనం వాళ్ళకి తెలియడం లేదు - సిమ్రాన్
1995లో 'సనమ్ హర్జై' అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నటి సిమ్రాన్ బాలీవుడ్ లో గోవిందా, సల్మాన్ ఖాన్, మిథున్ చక్రవర్తి,అజయ్ దేవగన్ వంటి స్టార్ హీరోలతో నటించింది. అంత మంది స్టార్లతో నటించినా కూడా తన పనితనం ఏంటో బాలీవుడ్ వాళ్లకు తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిమ్రాన్ మాట్లాడుతూ.. "హిందీ సినిమాలతో నా కెరియర్ ని ప్రారంభించాను. కానీ ఇప్పటికి కూడా బాలీవుడ్ వాళ్లకి నా పనితనం ఏంటో తెలియదు. ఎందుకంటే చాలామంది నాకు ఇప్పటికీ అవకాశాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. కానీ వాళ్ళ సినిమాల్లో నాకు పాత్రలు ఇవ్వడం కంటే ముందు టెస్ట్ వీడియోలు పంపమని అడుగుతున్నారు. అయితే వాళ్లకి నేను ఆ పాత్రకి సెట్ అవుతానా లేదా అనే డౌట్ ఉంది. దాన్ని నేను తప్పు పట్టడం లేదు.
బాలీవుడ్ తో పోల్చితే అక్కడే ఎక్కువ - సిమ్రాన్
ఎందుకంటే అందరికీ నా గురించి తెలియదు కదా.. కానీ సౌత్ ఇండస్ట్రీలో ఇచ్చే రెమ్యూనరేషన్ కి పదో వంతు మాత్రమే నార్త్ ఇండస్ట్రీలో ఇస్తారు. ఈ కారణం వల్లే నా గురించి పూర్తిగా తెలిసిన వారితోనే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను. ఇక నేను గుల్మోహర్ సినిమా చేసిన సమయంలో వాళ్ళందరితో చాలా బాగా కలిసిపోయాను.. వాళ్లంతా మంచివాళ్లు. కానీ ఆ తర్వాత చేసిన ప్రాజెక్టులో ఉన్న వారితో నేను ఎక్కువగా కనెక్ట్ కాలేకపోయాను" అంటూ సిమ్రాన్ చెప్పుకొచ్చింది.అయితే సిమ్రాన్ ఈ మాటలు మాట్లాడడానికి కారణం బాలీవుడ్ లో ఇచ్చే రెమ్యూనరేషన్ తక్కువే..అలాగే ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా కూడా తన పనితనం ఏంటో వాళ్లకు తెలియదని ఆమె చెప్పుకొచ్చారు.
సిమ్రాన్ కెరియర్..
హిందీలో తన కెరీర్ ని మొదలు పెట్టినప్పటికీ సిమ్రాన్ కి స్టార్డం వచ్చింది మాత్రం తెలుగు,తమిళ సినిమాలతోనే అని చెప్పుకోవచ్చు సిమ్రాన్ సినిమాల విషయానికొస్తే.. ది టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా తర్వాత సిమ్రాన్ కి ఎన్నో చిన్న, మధ్య తరహా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయట. అంతేకాదు ఆ సినిమాల్లో సిమ్రాన్ కి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంటుందట కానీ పెద్ద ప్రొడక్షన్ హౌస్ ల నుండి తనకు ఇప్పటివరకు ఒక్క అవకాశం కూడా రావడం లేదంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సిమ్రాన్ 'ద లాస్ట్ వన్' అనే సినిమాలో నటిస్తోంది.
