షాక్ ఇచ్చిన స్టార్ కాంబో..ఊహించలేదే!
కోలీవుడ్ స్టార్ శింబు కెరీర్ మళ్లీ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. వరుసగా అవకాశాలతో బిజీ అవుతున్నాడు. ఈ క్రమంలో హీరోగానూ ఛాన్సులందుకుంటున్నాడు.
By: Srikanth Kontham | 27 Sept 2025 11:11 AM ISTకోలీవుడ్ స్టార్ శింబు కెరీర్ మళ్లీ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. వరుసగా అవకాశాలతో బిజీ అవుతున్నాడు. ఈ క్రమంలో హీరోగానూ ఛాన్సులందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తన 49వ చిత్రం వెట్రీమారన్ తో సినిమా లాక్ అయింది. ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే గ్యాంగ్ స్టర్ స్టోరీ ఇది. ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే సినిమా సెట్స్ కు వెళ్లకముందే ఓ ప్రోమో కూడా సిద్దం చేసారు. అక్టోబర్ 4న ఆ ప్రోమో రిలీజ్ కానుంది. మరి అందులో ఏం చూపిస్తారో చూడాలి. ఇక వెట్రీమారన్ సినిమా చేస్తున్నాడంటే? ఆ సినిమాకు సంగీత దర్శకుడు జీవి. ప్రకాష్ మాత్రమే అవుతాడు.
జీవికీ రీప్లేస్ మెంట్:
మారన్ సినిమాలకు ఎక్కువగా సంగీతం అందించింది అతడే. ఈ నేపథ్యంలో శింబు సినిమాకు తానే మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని అంతా భావించారు. సోషల్ మీడియాలో కూడా ప్రకాష్ పేరే కనిపిస్తుంది. కానీ వెట్రీమీమారన్ ఈ విషయంలో ప్రేక్షకాభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. జీవికి బధులుగా ఆ స్థానంలో మరో సంచలనం అనిరుద్ రవిచందర్ ని తెరపైకి తెచ్చారు. దీంతో వెట్రీమారన్ సంగీత పరంగా కొత్తదనం కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. శింబు సినిమాలకు ఇంత వరకూ అనిరుద్ పని చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ కాంబో కూడా కొత్త కలయికే అవుతుంది.
రెండు భాషల్లోనూ బ్రాండ్:
రెండు..మూడేళ్లగా అనిరుద్ పేరు సౌత్ లో మారుమ్రోగిపోతున్న సంగతి తెలిసిందే. తన బీజీఎమ్ తోనే సినిమాను హిట్ చేయడం తన ప్రత్యేకత గా మలుచుకున్నాడు. కంటెంట్ ఎలా ఉన్నా సంగీతంతో ప్రేక్షకుల్లో వైబ్ తీసుకొ స్తున్నాడు. ఊర్రూతలూగించే పాటలు..బీజీఎమ్ తో సినిమాను పతాక స్థాయిలో నిలబెడుతున్నాడు. అనిరుద్ మ్యూజిక్ కి సినిమా కంటెంట్ కూడా ఆ విజయం నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఈనేపథ్యంలో శింబు 49వ చిత్రం మరింత ప్రతిష్టాత్మకంగా మారుతుంది. తెలుగు సినిమాలకు అనిరుద్ బ్రాండ్ గా మారుతున్నాడు.
రీసెంట్ రిలీజ్ లు అన్నీ అతడి ఖాతాలోనే:
ఇక్కడ దర్శకులు అతడితో పని చేయడానికి అమితాసక్తి చూపిస్తున్నారు. ఈనేపథ్యంలో అనిరుద్ మరింత బిజీ అయ్యాడు. ఇటీవల రిలీజ్ అయిన `కింగ్ డమ్` కి తానే సంగీతం అందించాడు. `మదరాసి`, `కూలీ`, `విదాముయార్చీ` చిత్రాలకు తానే సంగీతం అందించాడు. అలాగే బాలీవుడ్ లో షారుక్ ఖాన్ వారసుడు డైరెక్ట్ చేసిన `బ్యాడ్స్ఆఫ్ బాలీవుడ్` సిరీస్ లో ఓ పాటని కంపోజ్ చేసాడు. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
