శింబు కోసం రూటు మార్చిన వెట్రిమారన్
ఈ నేపథ్యంలోనే వారి కలయికలో వచ్చే సినిమాలకు మంచి హైప్ ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి ఓ కాంబినేషన్ ఇప్పుడు బ్రేక్ అవుతున్నట్టు తెలుస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 4 Oct 2025 12:11 PM ISTఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు మంచి క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ ఎంతలా ఉంటుందంటే వారిద్దరి కలయికలో సినిమా వస్తుందంటే ఆ సినిమా కచ్ఛితంగా అంచనాలకు మించి ఉంటుందని ఆడియన్స్ అనుకునేలా. ఈ నేపథ్యంలోనే వారి కలయికలో వచ్చే సినిమాలకు మంచి హైప్ ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి ఓ కాంబినేషన్ ఇప్పుడు బ్రేక్ అవుతున్నట్టు తెలుస్తోంది.
వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు సినిమా
ఇక అసలు విషయానికొస్తే, కోలీవుడ్ ఇండస్ట్రీలో మాస్, కంటెంట్ కలిపి చూపించగల డైరెక్టర్ ఎవరంటే అందరూ చెప్పే మొదటి పేరు వెట్రిమారన్. ఆడుకలాం, వడా చెన్నై, అసురన్ లాంటి సినిమాలతో డైరెక్టర్ గా ఆయన వేసి ముద్ర అలాంటిది. రీసెంట్ గా తన ప్రొడక్షన్ కంపెనీని మూసేస్తున్నట్టు అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చిన వెట్రిమారన్ ప్రస్తుతం శింబు తో చేస్తున్న సినిమాపైనే తన ఫోకస్ ను పెట్టారు.
ఎక్కువగా జీవీతో సినిమాలు చేసిన వెట్రిమారన్
శింబు స్టైల్, వెట్రిమారన్ రియలిస్టిక్ మేకింగ్ ఎలా ఉంటుందో అని ఆడియన్స్ ఈ ప్రాజెక్టు విషయంలో ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే వెట్రిమారన్ సినిమాల సక్సెస్ లో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ పాత్ర కూడా ఎంతో కీలకం. వెట్రిమారన్ సినిమాలకు ఎక్కువగా ఆయనే సంగీతం అందించడంతో ఇప్పుడు శింబు సినిమాకు కూడా జీవీనే మ్యూజిక్ ఇస్తారని అంతా అనుకున్నారు.
శింబు49కు అనిరుధ్ మ్యూజిక్
కానీ శింబు49 కోసం వెట్రిమారన్ రూట్ మార్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం వెట్రిమారన్ సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ను లైన్ లోకి దించుతున్నట్టు సమాచారం. ఆడు కలాం నుంచి వడా చెన్నై వరకు ఎన్నో సూపర్‌హిట్ ఆల్బమ్స్ ను ఇచ్చిన జీవీ ప్రకాష్ ను కాదని మరీ వెట్రిమారన్ ను అనిరుధ్ ను తీసుకోవడానికి కారణం సినిమాకు ఫ్రెష్ ఎనర్జీ తీసుకునిరావడానికే అని తెలుస్తోంది. గత రెండేళ్లుగా అనిరుధ్ పేరు సౌత్ లో ఏ రేంజ్ లో వినిపిస్తుందో తెలిసిందే. ఇప్పుడు వెట్రిమారన్ సినిమాకు కూడా అనిరుధ్ సంగీతం అందించనున్నారని తెలిసి ఈ ప్రాజెక్టు పై అంచనాలు మరిన్ని పెరిగాయి. పైగా ఈ సినిమా వడా చెన్నై యూనివర్స్ లో తెరకెక్కనుండటంతో శింబు49 ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
