మనోజ్ ప్రాజెక్ట్‌లో శింబు.. కాస్టింగ్‌పై ఆసక్తికర బజ్!
ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 'వార్ డాగ్' అనే భారీ బైక్‌ను డిజైన్ చేశారు. దాదాపు 700 కిలోల బరువుండే ఈ బైక్ ఆ కాలం నాటి యాక్షన్ ఎపిసోడ్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
By: Madhu Reddy | 23 Aug 2026 5:08 PM ISTటాలీవుడ్ విలక్షణ నటుడు మంచు మనోజ్, తమిళ స్టార్ హీరో శింబు మధ్య ఉన్న మంచి స్నేహం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి అపూర్వ మైత్రి వెండితెరపై ఒక క్రేజీ మల్టీస్టారర్ మ్యాజిక్‌కి దారితీస్తోంది. మంచు మనోజ్ నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'డేవిడ్ రెడ్డి'లో ఒక పవర్ ఫుల్ కేమియో రోల్ కోసం శింబుని ఎంపిక చేసినట్లు వస్తున్న వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ సంచలనం సృష్టిస్తున్నాయి.
'డేవిడ్ రెడ్డి'లో శింబు పవర్ ఫుల్ రోల్
హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'డేవిడ్ రెడ్డి' చిత్రంలో మనోజ్ పాత్రకు అన్నయ్యగా శింబు కనిపించనున్నారని టాక్. సినిమా కథలో ఎంతో కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఈ పాత్ర వస్తుందని తెలుస్తోంది. కథను భావోద్వేగంగా తిప్పే ఈ పవర్‌ఫుల్ క్యారెక్టర్ కోసం చిత్ర యూనిట్ శింబును సంప్రదించగా, మనోజ్‌తో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ ఇద్దరు మాస్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే థియేటర్లలో పూనకాలు ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆ విశేషాలు చూద్దాం..
బ్రిటిష్ కాలం నాటి విప్లవాత్మక కథ:
స్వాతంత్ర్యానికి పూర్వం, బ్రిటిష్ పరిపాలనా కాలం నాటి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఆంగ్లేయుల అన్యాయాలకు వ్యతిరేకంగా గళమెత్తి పోరాడిన 'డేవిడ్ రెడ్డి' అనే యోధుడి కథగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఇక ఈ సినిమాలో మనోజ్ సరసన తమిళ చిత్రం 'ప్రిన్స్' ఫేమ్ మరియా కథానాయికగా నటిస్తోంది. పీరియాడిక్ అట్మాస్ఫియర్, భారీ యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనున్నాయి.
ప్రత్యేక ఆకర్షణగా 700 కేజీల 'వార్ డాగ్' బైక్:
ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 'వార్ డాగ్' అనే భారీ బైక్‌ను డిజైన్ చేశారు. దాదాపు 700 కిలోల బరువుండే ఈ బైక్ ఆ కాలం నాటి యాక్షన్ ఎపిసోడ్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ అత్యంత వేగంగా జరుగుతోంది. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
ఇద్దరు బిగ్ స్టార్స్ ఒకే సినిమా:
టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమలకు చెందిన ఇద్దరు బిగ్ స్టార్స్ ఒకే సినిమాలో కలిసి నటించడం, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధిస్తే ట్రెండ్ సరికొత్త పుంతలు తొక్కడం ఖాయం. గతంలో కూడా ఇతర భాషా స్టార్స్ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి.ఇక 'జైలర్'లో రజనీకాంత్‌తో పాటు శివరాజ్‌కుమార్, మోహన్ లాల్ చేసిన రోల్స్ థియేటర్లను షేక్ చేశాయి. 'గాడ్ ఫాదర్' మూవీ లో చిరంజీవి తో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు 'డేవిడ్ రెడ్డి'లో మంచు మనోజ్, శింబుల కాంబినేషన్ కూడా హిట్ అయితే.. భవిష్యత్తులో మరిన్ని సౌత్-నార్త్ మల్టీస్టారర్ ప్రాజెక్టులకు ఇది గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లవుతుంది.
'భైరవం', 'మిరాయ్' చిత్రాలతో సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న మంచు మనోజ్, 'డేవిడ్ రెడ్డి'తో బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక కోలీవుడ్ స్టార్ శింబు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో ఈ సినిమాపై తెలుగుతో పాటు తమిళంలోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
