Begin typing your search above and press return to search.

దేవర 2లో కోలీవుడ్ స్టార్.. వర్కౌట్ అవుతుందా?

జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన రెండవ చిత్రం దేవర.

By:  Madhu Reddy   |   29 Sept 2025 4:00 AM IST
దేవర 2లో కోలీవుడ్ స్టార్.. వర్కౌట్ అవుతుందా?
X

జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన రెండవ చిత్రం దేవర. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ ని సంపాదించుకుంది. నిన్నటి రోజున దేవర సినిమా విడుదల అయ్యి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర బృందం దేవర 2 కూడా ఉంటుందంటూ అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేసింది. ఎన్టీఆర్ కి జోడిగా మొదటిసారి జాన్వీ కపూర్ నటించగా.. ఆమె అందం , అభినయం సినిమాకి ప్లస్ అయిందని చెప్పవచ్చు. సైఫ్ అలీ ఖాన్ కూడా విలన్ గా అద్భుతంగా నటించారు. గత ఏడాది సెప్టెంబర్ 27న విడుదలైన ఈ సినిమా రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

ఇదిలా ఉండగా.. దేవర 2 సినిమా ఈ ఏడాది డిసెంబర్లో షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. కొరటాల శివ స్క్రిప్టులో కొన్ని మార్పులు చేసి కొత్తగా చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దేవర 2 సినిమాలో ఒక కీలకమైన పాత్రలో తమిళ స్టార్ హీరో శింబును ఎంపిక చేసుకోబోతున్నట్లు తెలిసింది. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి ఈ విషయం తెలిసి అభిమానులు అయితే ఖుషీ అవుతున్నారు.

వాస్తవానికి దేవర సినిమా విషయంలో కొంతమేరకు నెగిటివిటీ ఏర్పడినా.. వాటన్నింటినీ దేవర 2 సినిమాతో చెరిపేయాలనే ఉద్దేశంతోనే కథలో ప్రత్యేకించి మరీ శింబు కోసం ఒక పాత్రను డిజైన్ చేశారట కొరటాల శివ . పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న ఈ సినిమాకి సరికొత్తగా ఎలిమెంట్స్ యాడ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఇందులో హీరోయిన్ జాన్వీ కపూర్ తో పాటుగా మరొక హీరోయిన్ ని తీసుకోబోతున్నట్లు సమాచారం. సంగీతాన్ని అనిరుధ్ అందించే విధంగా ప్లాన్ చేస్తున్నారు.మొత్తానికి దేవర 2 సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడేలా చేస్తున్న కొరటాల శివ మరి ఈ సినిమాని ఏ విధంగా తెరకెక్కించి ట్రోలర్ల కు గట్టి కౌంటర్ వేస్తారో చూడాలి మరి.

ఇకపోతే మరొకవైపు ఈ సినిమాలో శింబు నటిస్తున్నాడు అంటే వార్తలు రావడంతో అసలే బజ్ లేని సినిమాలో శింబు ఒప్పుకోవడం ఏమిటి ? వాస్తవానికి దేవర సినిమా తర్వాత సీక్వెల్ అవసరం లేదు కానీ కొరటాల సీక్వెల్ ప్రకటించారు ఇప్పుడు ఈ సీక్వెల్ కథలో ఎలాంటి మార్పులు చేస్తారు? ఇక కొరటాల శివ కథ పై నమ్మకం పెట్టుకొని రంగంలోకి దిగుతున్న సెలబ్రిటీలకు ఏ విధంగా న్యాయం చేకూరుతుంది? మొత్తానికి దేవర 2 వర్క్ అవుట్ అవుతుందా? అనే రేంజ్ లో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా పై ఇంత నెగిటివ్ ఉన్న నేపథ్యంలో కొరటాల వీటి నుంచి ఎలా బయటకు వస్తారో చూడాలి.