Begin typing your search above and press return to search.

ఫస్ట్ ప్లేస్ లో మహేష్ బాబు.. రెండో స్థానంలో అల్లు అర్జున్..

సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా అవార్డుల కార్యక్రమం 2025 ఇప్పుడు ఘనంగా దుబాయ్ లో జరుగుతోంది.

By:  M Prashanth   |   8 Sept 2025 12:56 AM IST
ఫస్ట్ ప్లేస్ లో మహేష్ బాబు.. రెండో స్థానంలో అల్లు అర్జున్..
X

మొదటి స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు.. రెండో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇదేం లిస్ట్ అని అనుకుంటున్నారా? ఆగండి.. అది సైమా (సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) ఉత్తమ నటుడి అవార్డులు పొందిన వారి జాబితా. ఇప్పటి వరకు అత్యధిక సార్లు మహేష్ బాబు గెలుచుకున్న విషయం మీకు తెలుసా?

సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా అవార్డుల కార్యక్రమం 2025 ఇప్పుడు ఘనంగా దుబాయ్ లో జరుగుతోంది. ఇప్పటికే తొలి రోజు 2024కు గాను తెలుగు సినిమాల్లో ప్రతిభ కనబర్చిన నటీనటులు అవార్డులను ప్రదానం చేశారు. అయితే టాలీవుడ్ లో ఉత్తమ నటుడిగా పుష్ప-2కి గాను స్టార్ హీరో అల్లు అర్జున్ నిలిచారు.

2024లో రిలీజ్ అయిన పుష్ప-2 చరిత్ర తిరగరాసింది. బన్నీకి ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు సైమా అవార్డు కూడా దక్కేలా చేసింది. అయితే ఇప్పటికే రెండు సార్లు సైమా బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. ఈ ఏడాది ముచ్చటగా మూడోసారి అందుకున్నారు. అత్యధిక అవార్డులు దక్కించుకున్న రెండో తెలుగు హీరోగా నిలిచారు.

అలా వైకుంఠపురంలో, పుష్ప-1, పుష్ప-2.. ఇలా మూడు సినిమాలకు అవార్డులు దక్కించుకున్నారు. అయితే ఇప్పటి వరకు మహేష్ బాబు.. నాలుగు సార్లు అవార్డులు అందుకున్నారు. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, మహర్షి చిత్రాలకు సూపర్ స్టార్.. తెలుగులో అత్యధికంగా అవార్డులను సొంతం చేసుకున్నారు.

అయితే 2012లో తొలిసారి సైమా అవార్డుల కార్యక్రమం జరిగింది. 2011లో రిలీజ్ అయిన సినిమాల్లో ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. అప్పుడు తొలి ఉత్తమ నటుడు అవార్డు కూడా మహేష్ అందుకోవడం విశేషం.మరి 2011-2024 వరకు ఎవరు ఏ సినిమాకు అవార్డు అందుకున్నారంటే?

2011 - మహేష్ బాబు ( దూకుడు )

2012 - పవన్ కళ్యాణ్ (గబ్బర్ సింగ్)

2013 - మహేష్ బాబు (SVSC )

2014 - బాలకృష్ణ (లెజెండ్)

2015 - మహేష్ బాబు (శ్రీమంతుడు )

2016 - ఎన్టీఆర్ (జనతా గ్యారేజ్ )

2017 - ప్రభాస్ (బాహుబలి 2)

2018 - రామ్‌చరణ్ ( రంగస్థలం )

2019 - మహేష్ బాబు (మహర్షి)

2020 - అల్లు అర్జున్ ( అలా వైకుంఠపురంలో)

2021 - అల్లు అర్జున్ (పుష్ప 1)

2022 - ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్)

2023 - నాని (దసరా)

2024 - అల్లు అర్జున్ (పుష్ప 2).. మరి 2025కి గాను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.