సందీప్- సంజయ్ 'సిగ్మా'.. ఫస్ట్ సింగిల్ తో హైప్ మరింత పెరిగేలా..
తమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొడుకు సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం సిగ్మా. ఆ మూవీపై మొదటి నుంచి ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
By: M Prashanth | 4 Jun 2026 11:40 PM ISTతమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొడుకు సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం సిగ్మా. ఆ మూవీపై మొదటి నుంచి ప్రత్యేక ఆసక్తి నెలకొంది. స్టార్ కిడ్ హీరోగా కాకుండా దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడం, మరోవైపు సందీప్ కిషన్ లాంటి ఎనర్జిటిక్ హీరో లీడ్ రోల్ లో నటించడం సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టైల్.. ఆ అంచనాలను మరింత పెంచేలా ఉందని చెప్పాలి.
సంగీత దర్శకుడు ఎస్. తమన్ కంపోజ్ చేసిన ఆ పాట పూర్తిగా యూత్ ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. మొదటి నుంచి చివరి వరకు హై ఎనర్జీ బీట్స్ తో సాగే ఆ సాంగ్ లో మాస్, ర్యాప్, ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేశారు. పాట వినగానే కొత్తగా అనిపిస్తూ.. తమన్ మార్క్ ఎనర్జీ క్లియర్ గా కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ బీట్స్, ర్యాప్ సెక్షన్స్ సాంగ్ కు మంచి ఊపు తీసుకొచ్చాయి.
అయితే పాటలో అసలు హైలెట్ మ్యూజిక్ కంటే విజువల్ ప్రెజెంటేషన్ అని చెప్పాలి. లైకా ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తున్నాయి. రిచ్ సెట్స్, స్టైలిష్ లైటింగ్, గ్రాండ్ స్కేల్ లో రూపొందించిన విజువల్స్ పాటను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఒక సాంగ్ కే ఇంత ఖర్చు పెట్టారంటే సినిమాలో విజువల్ ట్రీట్ ఏ స్థాయిలో ఉంటుందో అన్న చర్చ మొదలైంది.
సందీప్ కిషన్ పాటలో చాలా స్టైలిష్ గా కనిపించారు. ఇటీవల తన సినిమాల్లో విభిన్న పాత్రలు ఎంచుకుంటున్న ఆయన.. సిగ్మాలో కూడా కొత్త బాడీ లాంగ్వేజ్ తో కనిపిస్తున్నారు. డ్యాన్స్ మూవ్స్, యాటిట్యూడ్, స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా సందీప్ పూర్తి కాన్ఫిడెన్స్ తో కనిపించడం విశేషం. మరోవైపు ఫరియా అబ్దుల్లా తన గ్లామర్, ఎనర్జీతో సాంగ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
లిరిక్స్ విషయానికి వస్తే.. రొటీన్ కమర్షియల్ పదాలకు భిన్నంగా ర్యాప్ స్టైల్ లో రాసిన లైన్స్ వినిపించాయి. యూత్ కు కనెక్ట్ అయ్యేలా పదాలను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సాంగ్ మొత్తం ఒక స్టైల్ స్టేట్మెంట్ లా కనిపించడం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా, ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ఆ హైప్ ను కొనసాగించింది. ముఖ్యంగా జేసన్ సంజయ్ డైరెక్షన్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఏదేమైనా సిగ్మా స్టైల్ సాంగ్ తమన్ బీట్స్, స్టైలిష్ విజువల్స్, సందీప్ కిషన్-ఫరియా అబ్దుల్లా స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమాకు కావాల్సిన బజ్ ను క్రియేట్ చేసింది. ఫస్ట్ సింగిల్ తో మేకర్స్ ప్రేక్షకుల దృష్టిని తమవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇప్పుడు అందరి దృష్టి జూలై 31న విడుదల కానున్న సిగ్మాపై ఉంది. సినిమా కూడా ఇదే రేంజ్ లో ఆకట్టుకుంటే జేసన్ సంజయ్ కు దర్శకుడిగా సాలిడ్ స్టార్ట్ దక్కుతుందనే చెప్పాలి.
