Begin typing your search above and press return to search.

డేట్ నైట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన కియారా-సిద్ధార్థ్!

‘కాఫీ విత్ కరణ్’ షోలో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ తమ వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. డేట్ నైట్స్‌పై కరణ్ ప్రశ్నించగా, బేబీ బంప్‌పై చేయి వేసి కియారా ‘అబ్ బస్ హో గయా’ అంటూ నవ్వించారు. బెడ్‌రూమ్‌లోకి వృత్తిపరమైన విషయాలను తీసుకురామని సిద్ధార్థ్ సరదాగా సమాధానమిచ్చారు.

By:  Srikanth Kontham   |   12 Nov 2026 1:00 AM IST
డేట్ నైట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన కియారా-సిద్ధార్థ్!
X

బాలీవుడ్ క్యూట్ కపుల్స్ సిద్ధార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ జోడీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఓవైపు వృత్తిప‌రంగా కొన‌సాగుతూనే మ‌రోవైపు ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నా? ప‌ని ఒత్తిడి మాత్రం సెటట్స్ వ‌ర‌కే ప‌రిమితం చేస్తారు. సాయంత్రం 6 అయిందంటే? ఇంట్లో ఫ్యామిలీ విష‌యాలు త‌ప్ప వృత్తి ప‌ర‌మైన విశేషాలేవి చ‌ర్చ‌కు రాకుండా చూసుకుంటారు. తాజాగా ఈ జోడీ కాఫీ విత్ క‌ర‌ణ్ టాక్ షోలో సెకెండ్ ఇన్నింగ్స్ గురించి ఓ శుభ వార్త చెప్పారు. షోలో కియారా బేబీ బంప్‌ను ఫ్లాంట్ చేస్తూ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

షోలో భాగంగా హోస్ట్ కరణ్ జోహార్ వారిద్దరి వ్యక్తిగత జీవితం.. డేట్ నైట్స్‌కు సంబంధించి పలు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. మీ డేట్ నైట్స్ డిన్నర్‌తోనే ముగిసిపోకుండా ఉండటానికి ఏం చేస్తుంటారు? అని కరణ్ అడగ్గా? కియారా అద్వానీ తన చేతిని బేబీ బంప్ పై వేసి నవ్వుతూ `అబ్ బస్ హో గయా` అంటూ ఇచ్చిన ఆన్సర్ సెట్స్‌లోని నవ్వుల్లో ముంచెత్తింది. ఈ క్యూట్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే సమయంలో సిద్ధార్థ్ మల్హోత్రా కూడా తనదైన శైలిలో ఓపెన్ అయ్యారు. శృంగార జీవితం, వృత్తిపరమైన విషయాలపై హింట్స్ ఇచ్చారు.

`మేము మా పనిని ఇంటికి తీసుకురాం. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లోకి అసలు రానీయం` అంటూ సిద్ధార్థ్ ఇచ్చిన సరదా సమాధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కెరీర్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు అని ఆ జోడీ ఇచ్చిన‌ క్లారిటీ తీరుకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే కియారా `టాక్సిక్` త‌ర్వాత కొత్త సినిమాలేవి క‌మిట్ అవ్వ‌లేదు. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన ఆ సినిమా అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైన సంగ‌తి తెలిసిందే.

అమ్మ‌డికి సౌత్ లో తొలి నుంచి పెద్ద‌గా క‌లిసి రావ‌డం లేదు. తెలుగులో న‌టించిన సినిమా ఫ‌లితాలు కూడా నిరాశ‌కే గురి చేసాయి. ఇక సిద్దార్ద్ కెరీర్ కూడా ఏమంత స్పీడ్ గా లేదు. ఏడాదికో సినిమా చేయ‌డం త‌ప్ప హీరోగా పూర్తి స్థాయిలో బిజీ అవ్వ‌లేదు. ఇటీవ‌లే `ది వివాన్` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. కానీ ఆ సినిమా అంచ‌నాలు అందుకోలేదు. కానీ ఈ జోడీ అంటే బాలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. ఇద్ద‌రు క‌లిసి సినిమాలు చేయాల‌ని అభిమానులు ఆశ‌ప‌డుతున్నారు.