Begin typing your search above and press return to search.

సిద్ధు 'తెలుసు కదా'.. 4 రోజుల్లో ఎంత రాబట్టిందంటే?

దీపావళి ఫెస్టివల్ కానుకగా ఆడియన్స్ ముందుకు తెలుసు కదా మూవీ రీసెంట్ గా వచ్చిన సంగతి తెలిసిందే.

By:  M Prashanth   |   21 Oct 2025 2:13 PM IST
సిద్ధు తెలుసు కదా.. 4 రోజుల్లో ఎంత రాబట్టిందంటే?
X

దీపావళి ఫెస్టివల్ కానుకగా ఆడియన్స్ ముందుకు తెలుసు కదా మూవీ రీసెంట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. రొమాంటిక్, మ్యూజికల్ ఎంటర్టైనర్‌ గా రూపొందిన ఆ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ లీడ్ రోల్ పోషించారు. కేజీఎఫ్ శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా సినిమాలో యాక్ట్ చేశారు.





శ్రీనివాస్ రెడ్డి, హర్ష చెముడు కీలక పాత్రల్లో కనిపించగా, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన తెలుసు కదా మూవీతో దర్శకురాలిగా మారగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. అక్టోబర్ 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేశారు.

ఇప్పుడు నాలుగు రోజులకు గాను వసూళ్లు లెక్కలను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 16.3 కోట్ల రూపాయలు వసూలు చేసిందని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తెలుసు కదా మూవీ హవా చూపిస్తుందని, పెద్ద స్క్రీన్లపై ప్రత్యేకమైన ప్రేమకథను మిస్ అవ్వకండంటూ కోరుతూ పోస్టర్ రిలీజ్ చేశారు.

అయితే మేకర్స్ చెప్పినట్లు తెలుసు కదా మూవీ ప్రత్యేకమైన స్టోరీ. కానీ చాలా మంది ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేసింది. కథకు కనెక్ట్ అయిన వాళ్లకు మాత్రం సినిమా బాగా మెప్పించింది. యూత్ ను అలరించింది. దీంతో సినిమా మిక్స్ డ్ మౌత్ టాక్ అందుకుంది. మల్టీ లేయర్ నారేటివ్ వల్ల అందరికీ మూవీ కనెక్ట్ కాలేకపోయింది!

సినిమా కథేంటంటే?.. మూవీలో సిద్ధూ ఓ అనాథ పాత్రలో వరుణ్ గా కనిపిస్తారు. తనకంటూ ఓ ఫ్యామిలీ కావాలని కోరుకునే ఆయన.. కాలేజీ రోజుల్లోనే రాగ (శ్రీనిధి శెట్టి)తో లవ్ లో పడతారు. అంతే కాదు ఆమెనే పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణయించుకుంటారు. కానీ అది కుదరదు. రాగ అత‌డిని పెళ్లి చేసుకునేందుకు ఓకే చెప్పదు.

ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని సంబంధాలు వెతుకుతాడు. ఆ సమయంలో అంజ‌లి (రాశీ ఖన్నా)తో మ‌న‌సు క‌ల‌వ‌డంతో మ్యారేజ్ చేసుకుంటారు. పిల్లలు కందామంటే ఓ సమస్య వస్తుంది. రాగ మళ్లీ వరుణ్ లైఫ్ లోకి వస్తుంది. అసలేంటి ఆ సమస్య? రాగ ఎందుకు మళ్లీ వచ్చింది? ముందుకు ఎందుకు వదిలేసింది? ఆమె వల్ల అంజలి, వరుణ్ మధ్య ఏం జరిగింది? చివరకు ఏమైంది? అనేది మూవీ. మరి మీరు తెలుసు కదా చూశారా?