సిద్ధు ప్లాన్ మామూలుగా లేదు.. హిట్స్ పడితే..
విభిన్నమైన కథాంశంతో సినిమా ఉండబోతుందని, ప్రస్తుతం స్క్రిప్ట్ పై చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
By: M Prashanth | 13 March 2026 9:00 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీస్ విషయంలో స్పెషల్ ప్లాన్ తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. కమర్షియల్ లేదా రొమాంటిక్ కామెడీ కథలతో ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన సిద్ధు, ఈసారి కొత్త తరహా కథలతో మూవీస్ చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆయన టార్గెట్ గా పెట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది.
సిద్ధు వరుసగా ఇప్పుడు ఆసక్తికరమైన ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మూడు కొత్త ప్రాజెక్టులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. అందులో ఒకటి సోషియో ఫాంటసీ స్టోరీతో రూపొందబోతున్న చిత్రమని సమాచారం. కొత్త దర్శకుడు ఆ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ మూవీ చాలా కొత్తగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది.
మరో ప్రాజెక్టును స్వరూప్ దర్శకత్వంలో సిద్ధు చేయబోతున్నట్లు తెలుస్తోంది. స్వరూప్ డైరెక్షన్ లో ఇప్పటికే వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ మంచి ప్రశంసలు అందుకుంది. స్పెషల్ స్టోరీ, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆయన గుర్తింపు పొందగా.. ఇప్పుడు అదే దర్శకుడితో సిద్ధు జొన్నలగడ్డ కలిసి పని చేయబోతున్నట్లు వార్తలు రావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
విభిన్నమైన కథాంశంతో సినిమా ఉండబోతుందని, ప్రస్తుతం స్క్రిప్ట్ పై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అంతేకాకుండా మరో మూవీ టాలీవుడ్ లో అత్యంత విజయవంతమైన దర్శకుల్లో ఒకరితో చేయబోతున్నట్లు సమాచారం. ఆ డైరెక్టర్ ఎవరు అనే విషయం ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే కమర్షియల్ గా స్ట్రాంగ్ స్టోరీతో ఆ సినిమా స్పెషల్ గా ఉండబోతుందని, సిద్ధు కెరీర్ లో ఇది ఒక కీలక ప్రాజెక్ట్ అవుతుందని వినికిడి.
అయితే సిద్ధూ.. రీసెంట్ గా జాక్, తెలుసు కదా సినిమాలతో వరుస డిజాస్టర్స్ అందుకున్నారు. ఆ మూవీలు మంచి విజయాన్ని సాధిస్తాయని భావించినప్పటికీ, రిజల్ట్స్ మాత్రం అంచనాలకు తగ్గట్లుగా రాలేదు. అందుకే తన తదుపరి ప్రాజెక్టుల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కథల ఎంపికలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ అందించే కథలను ఎంపిక చేస్తున్నారని టాక్.
ప్రస్తుతం సిద్ధు.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఒక సినిమాలో నటిస్తుండగా.. ఆ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఆ చిత్రం పూర్తైన తర్వాత ఆయన కొత్త గా లాక్ చేసిన మూడు ప్రాజెక్టుల్లో ఏదో ఒకటి ప్రారంభమయ్యే అవకాశముంది. అయితే కొత్త కథలు, కొత్త దర్శకులు, ప్రముఖ డైరెక్టర్స్ తో కలిసి పని చేస్తూ ప్రేక్షకులను మెప్పించేలా ఆయన పెద్ద ప్లానే వేస్తున్నారని చెప్పాలి. ఆ మూడు సినిమాలు కూడా హిట్ అయితే.. సిద్ధు కెరీర్ మలుపు తిరిగే ఛాన్స్ పక్కగా ఉందనే చెప్పాలి. మరేం జరుగుతుందో చూడాలి.
