Begin typing your search above and press return to search.

సిద్ధు 'తెలుసు కదా'.. ఓపెనింగ్స్ విషయంలో ఏం జరిగింది?

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ రీసెంట్ గా తెలుసు కదా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   18 Oct 2025 2:15 PM IST
సిద్ధు తెలుసు కదా.. ఓపెనింగ్స్ విషయంలో ఏం జరిగింది?
X

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ రీసెంట్ గా తెలుసు కదా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమాకు నీరజ కోన దర్శకత్వం వహించారు. తెలుసు కదా చిత్రంతోనే డైరెక్టర్ గా పరిచయమయ్యారు. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా యాక్ట్ చేశారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన తెలుసు కదా మూవీ.. అక్టోబర్ 17వ తేదీన దీపావళి కానుకగా గ్రాండ్‌ గా విడుదలైంది. అయితే ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. సినిమా తొలి రోజు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.4.8 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. రూ.2 కోట్లకు పైగా నెట్ వసూలు సాధించిందట.

దీంతో ఇప్పుడు తెలుసు కదా మూవీ ఓపెనింగ్స్ కోసం సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోందని చెప్పాలి. ఎందుకంటే.. టిల్లు ఫ్రాంచైజీ చిత్రాలతో సిద్ధు వేరే లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్నారు. స్టార్ బాయ్ గా మారారు. టైర్-2 హీరోగా ఉన్నారు. ఆ పరంగా చూసుకుంటే.. తెలుసు కదా ఓపెనింగ్స్ తక్కువనే అంతా అంటున్నారు.

సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్ అయ్యాక వచ్చిన టాక్ బట్టి.. వసూళ్లు పెరుగుతాయి. కానీ ముందు ప్రమోషన్స్ వల్ల ఏర్పడిన బజ్ పై ఓపెనింగ్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఆ బజ్ ను క్రియేట్ చేసే విషయంలో తెలుసు కదా మేకర్స్ ఫెయిల్ అయ్యారని అనేక మంది నెటిజన్లు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు.

నిజానికి సూపర్ హిట్ టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు జాక్ మూవీ చేయగా.. డిజాస్టర్ గా మిగిలింది. మేకర్స్ కు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో తెలుసు కదా సినిమాపై సిద్ధు ఫోకస్ పెట్టారు. కానీ ఆయన సహా మేకర్స్.. ఆడియన్స్ లో అనుకున్న స్థాయిలో బజ్ మాత్రం క్రియేట్ చేయలేకపోయారు. ప్రమోషనల్ కంటెంట్ తో అంతగా ఆకట్టుకోలేకపోయారు.

ముఖ్యంగా రిలీజ్ కు ముందు మేకర్స్ విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్.. అందరి దృష్టిని ఆకర్షించడంలో విఫలమైంది. యూత్ లో సిద్ధుకు యమా క్రేజ్ ఉన్నా.. వారిని కూడా ఆకర్షించలేదు. ట్రైలర్ లో సినిమాలో బోల్డ్ కాన్సెప్ట్‌ ఉందని హింట్స్ ఉండడంతో కుటుంబ ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో వివిధ కారణాల వల్ల బజ్ క్రియేట్ అవ్వలేదు. ఇప్పుడు ఓపెనింగ్స్ సాలిడ్ గా సాధించలేదు.