రవితేజ బయోపిక్.. అతను ఎందుకు ఆగిపోయాడంటే?
ప్రముఖులపై బయోపిక్ లు చేయడం కొన్నేళ్లుగా సినిమా రంగంలో ట్రెండ్ గా మారింది.
By: M Prashanth | 13 Oct 2025 4:34 PM ISTప్రముఖులపై బయోపిక్ లు చేయడం కొన్నేళ్లుగా సినిమా రంగంలో ట్రెండ్ గా మారింది. ఇలా మాహానటి సావిత్రి జీవిత కథను తెరకెక్కించి సూపర్ సక్సెస్ అయ్యారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఆ తర్వాత తెలుగులో పలువురు ప్రముఖుల బయోపిక్ లు వచ్చాయి కానీ, అవి అంతగా విజయం సాధించలేదు.
అయితే మళ్లీ ఈ బయోపిక్ ల టాపిక్ తెరపైకి రావడానికి కారణం యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా తెలుసు కదా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా మాస్ మహారాజ రవితేజ తో ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో సిద్ధు.. తనకు రవితేజ అంటే ఇష్టం అని చెప్పాడు. అలాగే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్, చిన్న చిన్న పాత్రల నుంచి హీరోగా ఎదిగారు రవితేజ.
అలా ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా ఎదిగిన తీరును బయోపిక్ గా తీసి తెరకెక్కించాలని ఒకప్పుడు సిద్ధు భావించారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పారు. తన సినిమా కృష్ణ అండ్ హీజ్ లీల సినిమా తర్వాత రవితేజ బయోపిక్ చేయాలని గట్టిగా ప్లాన్ చేశారట. కొన్ని రోజులు దీనిపై పని చేశారట. కానీ, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ప్లాన్ విరమించుకున్నానని సిద్ధు చెప్పారు. అయితే ఇది విన్న రవితేజ కూడా బయోపిక్ లపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
బయోపిక్స్ సినిమాల్లో ఒక మనిషికి సంబంధించిన అన్ని అంశాలు చూపించాలి. కానీ ఇక్కడ పాజిటివ్ కోణంలోనే ఉంటున్నాయి. అలా కాకుండా ఆ మనిషిలోనీ నెగెటివ్స్ కోణాన్ని కూడా చూపించాలి అని రవితేజ అన్నారు. అలాగే తాను కూడా ఒక నటుడి బయోపిక్ తెరెకెక్కించాలని అనుకున్నారట. ఎవరి బయోపిక్ అని అడగ్గా.. తాను ఆ నటుడు ఎవరో చెప్పలేదు.
కాగా, ఈ ఇద్దరికి తాజా సినిమాలు ఈ నెలలో థియేటర్లలోకి రానున్నాయి. అక్టోబర్ 17న సిద్ధు నటించిన తెలుసు కదా రిలీజ్ కానుంది. నీరజ కోన తెరకెక్కించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. మరోలైపు రవితేజ మాస్ జాతర సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆ సినిమా ఇదే నెల 31న విడుదల కానుంది.
