Begin typing your search above and press return to search.

టిల్లు బాబు క్యూబ్ తో కొట్టే వ‌ర‌కూ కొత్త‌వి ఉండ‌వా?

యంగ్ హీరో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ `డీజేటిల్లు`తో ఏ రేంజ్ లో ఫేమ‌స్ అయ్యాడో తెలిసిందే.

By:  Srikanth Kontham   |   24 Oct 2025 1:00 AM IST
టిల్లు బాబు క్యూబ్ తో కొట్టే వ‌ర‌కూ కొత్త‌వి ఉండ‌వా?
X

యంగ్ హీరో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ `డీజేటిల్లు`తో ఏ రేంజ్ లో ఫేమ‌స్ అయ్యాడో తెలిసిందే. అప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో సినిమాలు చేసినా? ఏ సినిమా ఇవ్వ‌ని గుర్తింపును `డీజేటిల్లు` ఇచ్చింది. ఒక్క విజ‌యం యువ‌త‌లో భారీ ఫాలోయింగ్ తెచ్చి పెట్టింది. అటుపై `టిల్లు స్క్వేర్` తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. దీంతో సిద్దు క్రేజ్ మరింత రెట్టింపు అయింది. ఆ వేంట‌నే `జాక్` అంటూ మ‌రో చిత్రంతో వ‌చ్చాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించ‌లేదు. అయినా ఆ ప‌రాజ‌యం సిద్దం వేగం ముందు క‌నిపించ‌లేదు. పెద్ద‌గా హైలైట్ కాలేదు.

తాజాగా `తెలుసు క‌దా` అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా డివైడ్ టాక్ తో ఆడుతోంది. మంచి కంటెంట్ ఉన్న సినిమా అని ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ మాట్లాడుకుంటున్నా? ప్రేక్ష‌కుల్లో క‌న్ప్యూజ్ అవుతున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి. కొన్ని ఏరియాల్లో సినిమా ఇప్ప‌టికే బ్రేక్ ఈవెన్ కూడా అయింది. మ‌రి ఈ సినిమా లాంగ్ ర‌న్ లో ఎలాంటి ఫ‌లితాలు సాధిస్తుందో చూడాలి. ఏదీ ఏమైనా సిద్దులో మునుప‌టి వేగం క‌నిపించ‌లేదు. ఇప్పుడున్న వేగం స‌రిపోదు అస‌లే కాంపిటీష‌న్ ఎక్కువ‌గా ఉంది.

కొత్త తార‌లు దూసుకొస్తున్న త‌రుణంలో వైఫ‌ల్యాలు అన్న‌వి? వెన‌క్కి నెట్టే అవ‌కాశం ఉంది. మ‌రి ఈ సిచ్వేష‌న్ దాటుకుని ఎలా ముందుకు సాగుతాడు? అన్న‌ది చూడాలి. అవ‌కాశాల ప‌రంగా కొద‌వ‌లేదు. ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు సిద్దుతో సినిమాల కోసం క్యూలో ఉన్నారు. అయితే వాళ్లంద‌రి కంటే ముందుగా టిల్లు క్యూబ్ ని పూర్తి చేసి రిలీజ్ చేసే వ‌ర‌కూ కొత్త ప్రాజెక్టులు ఏవీ ఒప్పుకోకూడ‌ద‌ని బ‌ల‌మైన నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుతం ఈ సినిమా ప‌నుల్లోనే సిద్దు బిజీగా ఉన్న‌ట్లు స‌మాచారం. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కు రాలేదు.

ద‌ర్శ‌కుడు ఎవ‌రు? నిర్మాత ఎవ‌రు? హీరోయిన్ వివ‌రాలేవి ప్ర‌చారంలో లేవు. `డీజే టిల్లు` ను విమ‌ల్ కృష్ణ తెర‌కెక్కించ‌గా..`టిల్లు స్క్వేర్` ని మ‌ల్లిక్ రామ్ తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఒకే ద‌ర్శ‌కుడుని కంటున్యూ చేయ‌క‌పోవ‌డంతో మూడ‌వ భాగం ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. సిద్దు రైట‌ర్ కావ‌డంతో ఈసారి ద‌ర్శ‌కుడి బాధ్య‌త‌లు తానే తీసుకున్నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు.