Begin typing your search above and press return to search.

సిద్ధు 'తెలుసు కదా'.. ఆ సీక్రెట్ చెప్పి షాక్ ఇచ్చాడు..!

ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్ట్ ఇంకా టెక్నిషియన్స్ ఒక్కొక్కరి గురిచి సిద్ధు చెప్పాడు. ఈ సినిమాలో హీరోయిన్స్ రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ఇద్దరు అదరగొట్టారని రాశి కాస్త ఎక్కువ కష్టపడిందని అన్నారు.

By:  Ramesh Boddu   |   23 Oct 2025 9:53 AM IST
సిద్ధు తెలుసు కదా.. ఆ సీక్రెట్ చెప్పి షాక్ ఇచ్చాడు..!
X

సిద్ధు జొన్నలగడ్డ లీడ్ రోల్ లో నీరజ కోన డైరెక్షన్ లో వచ్చిన సినిమా తెలుసు కదా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా రిలీజ్ ముందు వరకు ఎలా ఉన్నా రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో మాత్రం ఒక రేంజ్ లో డిస్కషన్ మొదలైంది. లేటెస్ట్ గా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ లో తెలుసు కదా లీడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ సినిమాలో తన ఎక్స్ పీరియన్స్ షేర్ చేసుకున్నాడు.

తెలుగు రాకపోయినా సరే ఇద్దరు చాలా బాగా కోపరేట్..

ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్ట్ ఇంకా టెక్నిషియన్స్ ఒక్కొక్కరి గురించి సిద్ధు చెప్పాడు. ఈ సినిమాలో హీరోయిన్స్ రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ఇద్దరు అదరగొట్టారని రాశి కాస్త ఎక్కువ కష్టపడిందని అన్నారు. తెలుగు రాకపోయినా సరే ఇద్దరు చాలా బాగా కోపరేట్ చేశారని చెప్పాడు సిద్ధు. ఇక ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ తను స్క్రీన్ మీద అలా ఉన్నానంటే వాళ్లే కారణమని అన్నాడు. తనకు ఇలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు నీరజ కోనకు థాంక్స్ చెప్పాడు సిద్ధు. సినిమాకు థమన్ ఇచ్చిన సాంగ్స్, బిజిఎం చార్ట్ బస్టర్ అయ్యాయని.. థమన్ కి థాంక్స్ చెప్పాడు సిద్ధు.

ఈ సినిమా కథ ముందు నితిన్ కి చెబితే సిద్ధుకి బాగుంటుందని ఆయన సజస్ట్ చేశారట. అందుకే నితిన్ కి కూడా సిద్ధు చెప్పాడు. సినిమాలో హర్ష కమెడియన్ కాదు ఫ్రెండ్ రోల్ చేశాడు. తను ఉన్న ప్రతి సీన్ చాలా బాగా వచ్చిందని అన్నాడు సిద్ధు. టిల్లు నుంచి వరుణ్ క్యారెక్టర్ కి ట్రాన్స్ ఫర్మేషన్ కోసం తన టీం హెల్ప్ చేశారని చెప్పాడు సిద్ధు.

బివిఎస్ రవి, కోనా వెంకట్ తనకు ఫ్యామిలీ మెంబర్స్..

ఇక రైటర్ బివిఎస్ రవి, కోనా వెంకట్ తనకు ఫ్యామిలీ మెంబర్స్ లాగా అని.. ఎలాంటి డౌట్ వచ్చినా సరే వాళ్లతో డిస్కస్ చేస్తా అన్నారు. ఇక బండ్ల గణేష్, ఎస్.కె.ఎన్ గురించి చెబుతూ చాలా మంది స్టేజ్ ఎక్కితే చాలా కూల్ గా మాట్లాడతారు.. వీళ్లిద్దరు మాత్రం అదరగొట్టేస్తారు. ఎస్.కె.ఎన్ చెప్పినట్టు తెలుసు కదా క్లాస్ సినిమా కాదు కొన్నాళ్లు గుర్తుండిపోయే సినిమా అని అన్నాడు సిద్ధు.

ఐతే ప్రత్యేకంగా నీరజ గురించి చెబుతూ తాను ఇచ్చిన ఇన్ పుట్స్ ని కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుందని చెప్పాడు సిద్ధు. ఒక సినిమా రిలీజైనప్పుడు రిజల్ట్ ని బట్టి ఎలా ఫీల్ అవుతాం అన్నది మారుతుంది. డీజే టిల్లు రిలీజైనప్పుడు ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను.. టిల్లు స్క్వేర్ అప్పుడు కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యాను. జాక్ రిలీజైనప్పుడు కాస్త ఎమోషనల్ లాస్ ఫీల్ అయ్యాను. జాక్ రిజల్ట్ తో సాడ్ ఫీల్ అయ్యాను. వీటన్నిటి కంటే నేను తెలుసు కదా రిలీజైనప్పుడు పీస్ ఇచ్చింది. ఈ సినిమా చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది.. ప్రశాంతంగా పడుకునేలా చేసిందని అన్నాడు సిద్ధు జొన్నలగడ్డ.