టాలీవుడ్ అగ్రిమెంట్లపై నడవదు: సిద్ధు జొన్నలగడ్డ
అలాగే టాలీవుడ్ అనేది అగ్రిమెంట్ లపై నడవదని.. కేవలం నమ్మకం అనే మాటతోనే సినిమాలు చేస్తారని అన్నారు.
By: M Prashanth | 27 Sept 2025 5:28 PM ISTసిద్ధు జొన్నలగడ్డ ఇండస్ట్రీకి వచ్చి 10ఏళ్లకు పైగా అవుతున్నా.. డీజే టిల్లు, ఆ తర్వాత టిల్లు స్క్వేర్‌తో పాపులర్ అయ్యారు. ఈ సినిమాలు సిద్ధుకు యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించిపెట్టాయి. ఇక ఆయన తెలసు కదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా వచ్చే నెల 17న రిలీజ్ కానుంది. ఇది సిద్ధు ప్రొఫెషనల్ లైఫ్. అయితే రీసెంట్ గా ఆయన యూట్యూబ్ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు.
తన సినిమాల్లో నటనకు మించి తాను కష్టపడి చేసిన పని గురించి మాట్లాడారు. కెరీర్ ప్రారంభంలో గుంటూర్ టాకీస్ సినిమా సమయంలో ఎవరు కూడా స్క్రిప్ట్‌లు రెడీ చేసుకొని తన వద్దకు రాలేదని ఆయన అన్నారు. మంచి ప్రాజెక్టులు పొందడానికి రైటింగ్, ఫిల్మ్ మేకింగ్ వంటి వాటిని నేర్చుకున్నారని అన్నారు. నేను సినిమాల్లో కేవలం నటించాలనుకున్నాను అంతే. కానీ ఫిల్మ్ మేకింగ్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అలా అన్ని విషయాలు నేర్చుకున్నాను. అని సిద్ధు తెలిపారు.
అలాగే టాలీవుడ్ అనేది అగ్రిమెంట్ లపై నడవదని.. కేవలం నమ్మకం అనే మాటతోనే సినిమాలు చేస్తారని అన్నారు. దానికి ఆయన తాజా చిత్రం తెలుసు కదానే ఉదాహరణగా చెప్పారు. నేను ప్రస్తుతం చేస్తున్నసినిమా తెలుసు కదా. ఇది రూ.50 కోట్ల బడ్జెట్ ప్రాజెక్ట్. అయినప్పటికీ.. నాకు- నిర్మాతలకు మధ్య ఎలాంటి అగ్రిమెంట్లు లేవు. సినిమా బాగా రావడాన్ని నేను చూసుకోవాలి అంతే. నిర్మాకలు కూడా సినిమా నిర్మాణాన్ని చూసుకోమని చెబుతారు. నా తదుపరి సినిమా బదాస్. అది రూ.60 కోట్ల బడ్జెట్. ఈ సినిమాకు కూడా ఎలాంటి అగ్రిమెంట్లు లేవు. అని సిద్ధు వివరించారు.
అలాగే తన చివరి సినిమా జాక్ ఏప్రిల్ లో రిలీజైంది. టిల్లు తర్వాత భారీ అంచనాలుతో రిలీజైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో నిర్మాతలకు నష్టం కలగకూడదని తన వంతు సాయంగా రెమ్యూనరేషన్ రిటర్న్ ఇఛ్చినట్లు సిద్ధు చెప్పారు. దీనికి ఆయన లోన్ తీసుకున్నానని అన్నారు.
జాక్ నిర్మాతలకు రూ.4.75 కోట్లు వెనక్కి ఇచ్చేశాను. ఏదైనా నేను పలుమార్లు ఆలోచించను. ప్రస్తుతం నేను ఆ లోన్ ను తీర్చేయడంపైనే దృష్టి పెట్టాను. కాగా, తెలుసు కదా సినిమాను నీరజ కోన తెరకెక్కించారు. సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కీలక పాత్రలు పోషించారు. హర్ష చెముడు తదితరులు నటించారు. దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.
