Begin typing your search above and press return to search.

తెలుసు కదా.. సిద్ధు నెక్స్ట్ ప్రాజెక్ట్ పక్కన పెట్టారా?

అయితే ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలో షూటింగ్ మొదలు కానుందని సమాచారం.

By:  M Prashanth   |   22 Oct 2025 10:00 PM IST
తెలుసు కదా.. సిద్ధు నెక్స్ట్ ప్రాజెక్ట్ పక్కన పెట్టారా?
X

టాలీవుడ్ యంగ్ హీరో, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రీసెంట్ గా తెలుసు కదా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రొమాంటిక్ అండ్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వం వహించిన ఆ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మించారు.

దీపావళి కానుకగా రిలీజ్ అయిన తెలుసు కదా మూవీ ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ అందుకుంది. కొందరు సినిమా బాగుందని చెబుతుండగా.. మరికొందరు మాత్రం స్టోరీ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. మెచ్యూరిటీగా ఆలోచించిన పలువురు క్రిటిక్స్.. మంచి మూవీ అని ఇప్పటికే రివ్యూస్ ఇచ్చారు.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సిద్ధు జొన్నలగడ్డ నెక్స్ట్ మూవీ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏ సినిమా చేస్తారోనని మాట్లాడుకుంటున్నారు. నిజానికి.. తెలుసు కదా మూవీ తర్వాత సిద్ధు.. కోహీనూర్ సినిమాలో నటిస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. డివోషనల్ థ్రిల్లర్ గా రెండు భాగాలుగా ఆ సినిమా రూపొందనుందని టాక్ వచ్చింది.

సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ.. ఆ సినిమాను కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసి చాలా నెలల క్రితం అధికారికంగా ప్రకటించింది. కొంతకాలంపాటు సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఆ సినిమాను పక్కన పెట్టాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారట. తెలుసు కదా మూవీ రిలీజ్ కు ముందే నిర్ణయానికి వచ్చారని సమాచారం.

అది నిజమనే చెప్పాలి. ఎందుకంటే సిద్ధు జొన్నలగడ్డ తన జాక్ మూవీ ప్రమోషన్స్ లో ఆ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కోహినూర్ మూవీని పక్కన పెట్టే యోచనలో ఉన్నామని తెలిపారు. ఆ సినిమా బదులు బ్యాడాస్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు కూడా చెప్పారు.

అయితే ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలో షూటింగ్ మొదలు కానుందని సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఆ సినిమాకు రవికాంత్ పెరెపు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సిద్ధుతో కృష్ణ అండ్ హిజ్ లీల మూవీకి గాను ఆయన వర్క్ చేశారు.

ఇప్పుడు మరోసారి సిద్ధు జొన్నలగడ్డ, రవికాంత్ పెరెపు కాంబో రిపీట్ అవుతోంది. బ్యాడాస్ సినిమాలో యాక్టర్ రోల్ లో సిద్ధూ కనపడనున్నారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న ఇబ్బందులను సినిమా రూపంలో తీస్తున్నారు రవికాంత్. మరి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న బ్యాడాస్ మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.