టెస్టోస్టెరాన్ vs ఈస్ట్రోజెన్.. సిద్ధు 'తెలుసు కదా' డైలాగ్ ప్రోమో
టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు తెలుసు కదా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 9 Oct 2025 6:10 PM ISTటాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు తెలుసు కదా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమాలో యంగ్ బ్యూటీలు రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబర్ 17వ తేదీన మూవీ.. వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
దీపావళి కానుకగా విడుదల కానున్న తెలుసు కదా సినిమాకు ప్రముఖ స్టైలిష్ట్ నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతిప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న తెలుసు కదా మూవీపై అటు సిద్ధు ఫ్యాన్స్.. ఇటు ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
అదే సమయంలో మేకర్స్ విడుదల చేసిన టీజర్ తో పాటు సాంగ్స్.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆడియన్స్ లో హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. తాజాగా దాని రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. అందులో భాగంగా ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇప్పుడు నీకొకటి చెబుతా చూడు.. చేతులు చివరిదాకా ఫుల్ హాండ్స్ బ్లౌజెస్ వేసుకుని.. పెద్ద పెద్ద బొట్టులు దిద్దుకునే స్ట్రాండ్ లేడీస్ తో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని వైవా హర్ష చెబుతున్న డైలాగ్ తో ప్రోమో ప్రారంభమైంది. స్ట్రాంగ్ ఉమెన్ కు అంతుంటే.. మెన్ కు ఎంతుంటుంది.. ఈస్ట్రోజెన్ కు అంత ఉంటే.. టెస్టోస్టెరాన్ కు ఎంత ఉంటుందని సిద్ధు అంటారు.
ఆ తర్వాత ట్రైలర్ ను 12వ తేదీన రిలీజ్ చేస్తామని రివీల్ చేశారు. అయితే ప్రోమోలో పురుషుడు vs మహిళలు - టెస్టోస్టెరాన్ vs ఈస్ట్రోజెన్ అనే అంశాన్ని సినిమాలో తెలివి గా టీజ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం రిలేషన్స్ ను చూపించే ఆకర్షణీయమైన, భావోద్వేగ, చమత్కారమైన కథనంతో సినిమా తీస్తున్నట్లు ప్రోమో ద్వారా అర్థమవుతోంది.
సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ.. నెవ్వర్ బిఫోర్ అనేలా కనిపించనున్నారని తెలుస్తోంది. రాబోయే ట్రైలర్ యువత ఎమోషన్స్, హాస్యం, గ్లామర్, నీరజ కోన సిగ్నేచర్ నైపుణ్యాన్ని మిళితం చేస్తుందని సమాచారం. ఇద్దరిని ప్రేమించిన ఓ యువకుడి కథతో తెలుసు కదా రూపొందుతున్నట్లు ప్రచార చిత్రాలు చూస్తే ఇప్పటికే క్లారిటీ వచ్చింది. మరి ట్రైలర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.
