సిద్ధు ఇష్టమే ఇబ్బంది పెట్టేస్తుందా..?
డీజే టిల్లులో హీరోగా చేసి సూపర్ హిట్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ జర్నీ ఏమి సాఫీగా జరగలేదు.
By: Ramesh Boddu | 21 Nov 2025 4:00 PM ISTడీజే టిల్లులో హీరోగా చేసి సూపర్ హిట్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ జర్నీ ఏమి సాఫీగా జరగలేదు. ముందు చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ వచ్చి సైడ్ రోల్స్ నుంచి విలన్ రోల్స్ అలా లీడింగ్ యాక్టర్ గా ప్రమోట్ అయ్యాడు. కృష్ణా అండ్ హిస్ లీల సినిమా ఓటీటీ రిలీజ్ అయ్యి సిద్ధుకి మంచి పాపులారిటీ తెచ్చింది. ఇక డీజే టిల్లుతో అతని క్యారెక్టరైజేషన్ అతని పంచుల ప్రవాహం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. టిల్లు బోయ్ గా ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు సిద్ధు. ఆ సినిమా ఇచ్చిన బ్రేక్ తో టిల్లు స్క్వేర్ చేసి ఆ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సిద్ధు.
కెరీర్ లో 100 కోట్ల సినిమా పడితే..
కెరీర్ లో 100 కోట్ల సినిమా పడితే ఆ హీరో జోష్ ఎలా ఉంటుందో తెలుసు కదా.. అలానే సిద్ధు టిల్లు స్క్వేర్ తో తన మాస్ స్టామినా చూపించాడు. ఐతే ఆ తర్వాత మాత్రం అతని సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. జాక్ డిజాస్టర్ కాగా రీసెంట్ గా రిలీజైన తెలుసు కదా మిశ్రమ స్పందనతో సరిపెట్టుకుంది. థియేట్రికల్ రిలీజ్ లో సినిమా కొంతమంది బాగుందని అనగా.. మరికొంతమంది పెదవి విరిచారు. ఐతే రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ తర్వాత కూడా సినిమాకు అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.
తెలుసు కదా సినిమాలో సిద్ధు రోల్ నిజంగానే టిపికల్ గా అనిపిస్తుంది. ఐతే డీజే టిల్లు అదే ఆడియన్స్ అంతా టిల్లు రోల్ ని బాగా ఇష్టపడి ఆ తర్వాత అతను చేస్తున్న ఏ పాత్ర అయినా దాంతో పోల్చుకుంటున్నారు. అక్కడ రిజల్ట్ తేడా కొట్టేస్తుంది. తెలుసు కదా సినిమా సిద్ధు కాబట్టే డేర్ చేశాడన్న కామెంట్ ఉంది. ఐతే ఆడియన్స్ అతని నుంచి ఇంకా ఏదో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అతని మీద ఉన్న ఈ ఇష్టమే అతన్ని సాదాసీదా పాత్రల్లో చూడలేకపోతున్నారు అనేలా ఉంది.
డీజే టిల్లు కాదు అంతకుమించిన ఎంటర్టైన్మెంట్..
అందుకే సిద్ధు కూడా నెక్స్ట్ రాబోతున్న సినిమాలతో డీజే టిల్లు కాదు అంతకుమించిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అనేలా ఉన్నాడు. బడాస్ తో పాటు మరో ప్రాజెక్ట్ సిద్ధు చేస్తున్నాడు ఈ రెండు సినిమాలు సిద్ధు ని ఇష్టపడే ఆడియన్స్ కి ఫుల్ ఫీస్ట్ అందిస్తుందని టాక్. మరి సిద్ధు జొన్నలగడ్డ నెక్స్ట్ సినిమాలైనా సూపర్ సక్సెస్ ఇస్తాయా లేదా అన్నది చూడాలి.
సిద్ధు మాత్రం సక్సెస్ తో ఉత్సాహాన్ని తెచ్చుకున్నా తన ఫెయిల్యూర్స్ ని లెసన్స్ గా తీసుకుంటూ నెక్స్ట్ సినిమాలకు ఎలా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలి.. సూపర్ హిట్ సినిమాలు ఎలా అందించాలనే విషయం మీద గట్టి ఎఫర్ట్ పెట్టేస్తున్నాడని అర్ధమవుతుంది.
