Begin typing your search above and press return to search.

సిద్ధు 'తెలుసు కదా'.. టీజర్ చూశారా?

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ లీడ్ రోల్ లో ఇప్పుడు తెలుసు కదా మూవీలో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   11 Sept 2025 2:45 PM IST
సిద్ధు తెలుసు కదా.. టీజర్ చూశారా?
X

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ లీడ్ రోల్ లో ఇప్పుడు తెలుసు కదా మూవీలో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. పాపులర్ స్క్రీన్ రైటర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఆ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 17న మూవీని రిలీజ్ చేయనున్నారు.


కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి, టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా హీరోయిన్లు గా నటిస్తుండగా.. ఎస్ ఎస్ తమన్‌ సంగీతం అందిస్తున్నారు. యువరాజ్‌ సినిమాటోగ్రఫర్‌ గా పనిచేస్తుండగా.. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. అయితే మూవీ నుంచి రీసెంట్ గా వచ్చిన మల్లికా గంధ పాట మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఫస్ట్ సింగిల్ చార్ట్‌ బస్టర్‌ గా నిలిచిందని చెప్పాలి. ఇప్పుడు మేకర్స్ టీజర్ ను తీసుకొచ్చారు. ఇప్పటికే చెప్పినట్టు గురువారం టీజర్ ను విడుదల చేశారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో సినిమా రూపొందుతున్నట్లు టీజర్ ద్వారా ఫుల్ క్లారిటీ వచ్చేసింది. హీరోయిన్స్ ఇద్దరికీ సిద్ధు గంధం పూస్తున్న సీన్ తో టీజర్.. సరదాగా స్టార్ట్ అయింది.

ఆ తర్వాత ఇది నేచురల్ గా జరగాల్సిన పని ఇది.. నాకు రాసి పెట్టిన అమ్మాయి ఎవరో తానంతట తానే నా లైఫ్ లోకి రావాలని సిద్ధూ చెబుతారు. అనంతరం అటు రాశీ.. ఇటు శ్రీనిధితో రొమాన్స్ చేస్తూ కనిపించారు. ఇద్దరితో చిల్ అవుతుంటారు. ఎంజాయ్ చేస్తుంటారు. ఆ తర్వాత ఇద్దరితో కూడా పెళ్లి చేసుకుందామని చెబుతుంటారు.

చివర్లో ఏం నడుస్తుందిరా మైండ్ లో అడగ్గా.. తెలుసు కదా అని సిద్ధు చెప్పిన డైలాగ్ లో టీజర్ ఎండ్ అయింది. అయితే ఇద్దరితో ప్రేమాయణం నడవగా.. చివరకు ఏం జరిగిందనేది సినిమాగా తెలుస్తోంది. టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. గ్లింప్స్ అంతా చాలా కూల్ గా సాగిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సిద్ధూ చెప్పిన డైలాగ్స్ బాగున్నాయని, ఆయన మార్క్ క్లియర్ గా కనపడిందని చెబుతున్నారు. హీరోయిన్స్ ఇద్దరూ గ్లామరస్ గా.. ఆకట్టుకునే విధంగా ఉన్నారని అంటున్నారు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అట్రాక్టివ్ గా ఉందని చెబుతున్నారు. అయితే మరో నెల రోజుల్లో రిలీజ్ కానున్న తెలుసు కదా మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.