తెలుసు కదా.. వాళ్ల రియాక్షన్ ఏంటో..?
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా తెలుసు కదా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సరసన శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించారు.
By: Ramesh Boddu | 14 Nov 2025 11:41 AM ISTసిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా తెలుసు కదా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సరసన శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించారు. ఐతే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ లో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమాతో మహిళా దర్శకురాలు నీరజ కోన చేసిన అటెంప్ట్ బాగానే ఉన్నా కూడా ఎందుకో ఆడియన్స్ ని అంతగా మెప్పించలేకపోయింది. అందుకే కొంతమంది సినిమా చూసి థమ్స్ అప్ అంటే మరికొంతమంది థమ్స్ డౌన్ ఇచ్చారు.
సిద్ధు జొన్నలగడ్డ మెప్పించాడు..
ఐతే థియేట్రికల్ రన్ సోసోగానే ముగించిన ఈ సినిమా లేటెస్ట్ గా నేటి నుంచి ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. తెలుసు కదా సినిమా నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ ప్రైజ్ కే కొనేసింది. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ నేడు అయ్యింది. ఐతే థియేట్రికల్ రన్ లో ప్రేక్షకులను అంతగా మెప్పించలేని ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ కి అయినా నచ్చుతుందా లేదా అన్న డిస్కషన్ మొదలైంది. సిద్ధు జొన్నలగడ్డ మాత్రం సినిమాలో తన క్యారెక్టరైజేషన్ తో మెప్పించాడు.
రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఇచ్చిన పాత్రకు 100 శాతం న్యాయం చేసి అదరగొట్టాడు సిద్ధు. అటు శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా కూడా తన రోల్స్ కి న్యాయం చేశారు. శ్రీనిధి ఈ సినిమాలో తన గ్లామర్ తో ఆకట్టుకుంది. రాశి ఖన్నా కూడా ఇంప్రెస్ చేసింది. ఐతే ఈమధ్య కొన్ని సినిమాలు థియేట్రికల్ రన్ లో డిజప్పాయింట్ చేసినా ఓటీటీలో సూపర్ హిట్ అనిపించుకున్నాయి. ఐతే తెలుసు కదా సినిమాకు ఆ స్కోప్ ఉందని కొందరు అంటున్నారు.
థియేట్రికల్ వెర్షన్ లా కలెక్షన్స్ హడావిడి ఏమి ఉండదు..
అందుకే ఓటీటీ రిలీజ్ టైం లో ఈ సినిమా దర్శక నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. తెలుసు కదా డిజిటల్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది. మరి సిద్ధు చేసిన ఆ అటెంప్ట్ ఓటీటీ లవర్స్ ని ఎంతమేరకు మెప్పించింది అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. థియేట్రికల్ వెర్షన్ లా కలెక్షన్స్ హడావిడి ఏమి ఉండదు కానీ సినిమా థియేటర్ లో మిస్సై.. ఓటీటీలో చూసి నచ్చితే మాత్రం సోషల్ మీడియాలో అదే ఎక్స్ లో మాత్రం ఒక రేంజ్ లో డిస్కషన్ జరుగుతుంది. అది జరగాలంటే వాళ్లకి సినిమా నచ్చాలి.
సో మొత్తానికి ఓటీటీ రిలీజ్ లో ఆడియన్స్ రియాక్షన్ కోసం తెలుసు కదా మేకర్స్ ఎదురుచూస్తున్నారు. బిజినెస్ పరంగా తెలుసు కదా కొంతమేరకు ప్రాఫిటబుల్ అనిపించినా కమర్షియల్ అనేది థియేట్రికల్ కలెక్షన్స్ ని బట్టి అనుకుంటారు కాబట్టి ఓటీటీ టాక్ మీద ఈ సినిమా అసలు రిజల్ట్ ఏంటన్నది ఆధారపడి ఉంటుంది.
