మగాళ్ల పట్ల ప్రపంచమంతా అన్యాయంగానే!: సిద్ధూ జొన్నలగడ్డ
అయితే ఇప్పుడు ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న సిద్ధూ జొన్నలగడ్డ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
By: M Prashanth | 26 Sept 2025 3:20 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో, స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. స్పెషల్ ఫ్యాన్ బేస్ ను దక్కించుకున్నారు. పలు సినిమాలతో మంచి హిట్స్ ను అందుకున్న సిద్ధూ.. ఇప్పుడు సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. వివిధ మూవీల్లో యాక్ట్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడు ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న సిద్ధూ జొన్నలగడ్డ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుత సమాజంతోపాటు ప్రపంచంలో అందరూ మగాళ్ళ పట్ల విచిత్రంగా ప్రవరిస్తున్నారని తెలిపారు. కొన్నిసార్లు కష్టాల్లో ఉన్నప్పుడు.. ఏమైపోయినా పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు.
"పురుషుల పట్ల సమాజంతోపాటు ప్రపంచం వింతగా ప్రవర్తిస్తాయి. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. ఎవరూ పక్కన ఉండరు. ఎవరూ పట్టించుకోరు. పోయినా పట్టించుకోరేమో. మీరు ఏదో ఒకటి చేయాలి, మీరు ఏదో సాధించాలి, అప్పుడు వెళ్లి నిల్చుంటే మర్యాద ఇస్తారు. కానీ ఆ మర్యాద చాలా జెలసీ" అని సిద్ధూ జొన్నలగడ్డ తెలిపారు.
"అది కూడా తప్పక ఒప్పుకోవడం. పురుషుడు ఏదో ఒకటి చేయకపోతే సర్వైవ్ కాలేడు. అది అసాధ్యం. అందుకే పురుషుల విషయంలో ప్రపంచమంతా అన్యాయంగా ప్రవర్తిస్తుంది" అని చెప్పారు. ప్రస్తుతం సిద్ధూ కామెంట్స్ ను అనేక మంది నెటిజన్లు సమర్థిస్తున్నారు. స్టార్ బాయ్ వ్యాఖ్యలపై తమ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఇక సిద్ధూ కెరీర్ విషయానికొస్తే.. నాగచైతన్య జోష్ మూవీతో యాక్టివ్ మోడ్ లోకి వచ్చారు సిద్ధు. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. డీజే టిల్లు మూవీతో స్టార్ స్టేటస్ ను అందుకున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ ను కూడా దక్కించుకున్నారు. ఆ తర్వాత డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సిద్ధు.
రీసెంట్ గా జాక్ మూవీతో థియేటర్స్ లో సందడి చేసిన స్టార్ బాయ్.. డిజాస్టర్ ను అందుకున్నారు. ఆ సినిమా భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు తెలుసు కదా, టిల్లు క్యూబ్, బ్యాడాస్ సినిమాలు చేస్తున్నారు. అందులో తెలుసు కదా మూవీతో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నీరజ్ కోన దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఆ సినిమా అక్టోబర్ 17వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదలవనుంది.
