స్టార్ బాయ్ సిద్ధు జాక్ కష్టాలు..!
టిల్లు స్క్వేర్ తో 100 కోట్లు కొట్టిన సిద్ధు ఆ నెక్స్ట్ జాక్ తో అదే ఫాం కొనసాగిస్తాడు అనుకుంటే అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది.
By: Ramesh Boddu | 26 Sept 2025 11:24 AM ISTస్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో బంపర్ హిట్లు అందుకున్నాడు. ఆ రెండు సినిమాలతో సిద్ధు రేంజ్ ఎక్కడికో వెళ్లింది. యూత్ ఫుల్ హీరోగా సిద్ధు సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. టిల్లు స్క్వేర్ తో 100 కోట్లు కొట్టిన సిద్ధు ఆ నెక్స్ట్ జాక్ తో అదే ఫాం కొనసాగిస్తాడు అనుకుంటే అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. సిద్ధు జొన్నలగడ్డ జాక్ సినిమా డిజాస్టర్ అయ్యింది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన జాక్ సినిమా భారీ నష్టాలు తెచ్చింది.
రెమ్యునరేషన్ ఇవ్వాలన్న రూల్ లేదు..
ఐతే తన సినిమా ఫ్లాప్ అవ్వడంతో నిర్మాతకు తిరిగి 4.75 కోట్ల రూపాయలు ఇచ్చాడట సిద్ధు జొన్నలగడ్డ. అందుకు తాను లోన్ తీసుకున్నా అని ఆ లోన్ ఇప్పటికీ కడుతున్నా అని అన్నాడు సిద్ధు. సినిమా హిట్టైనా ఫ్లాపైనా హీరోలు తిరిగి రెమ్యునరేషన్ ఇవ్వాలన్న రూల్ ఏమి లేదు. కానీ ఈమధ్య కొందరు యువ హీరోలు తన మీద భారీ బడ్జెట్ పెట్టిన నిర్మాత కష్టాల్లో ఉంటే చూడటం ఇష్టం లేక రెమ్యునరేషన్ లో కొంత తిరిగి ఇచ్చేస్తున్నారు.
స్టార్ బాయ్ సిద్ధు కూడా జాక్ సినిమా నష్టాలను భర్తీ చేసేందుకు తన వంతుగా భారీ మొత్తాన్నే రిటర్న్ చేశాడని తెలుస్తుంది. ఐతే అందుకు తీసుకున్న లోన్ కడుతున్నా అని సిద్ధు చెప్పడం ఆడియన్స్ ని టచ్ చేసింది. లోన్ తీసుకుని మరీ నిర్మాతకు సాయం చేయడం మంచి విషయమని ఆడియన్స్ ప్రశంసిస్తున్నారు.
సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా..
సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం తెలుసు కదా సినిమాతో వస్తున్నాడు. ఆ సినిమాను నీరజ కోన డైరెక్ట్ చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. అక్టోబర్ 17న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో సిద్ధు సరసన శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించారు. థమన్ మ్యూజిక్ తో తెలుసు కదాకి జోష్ తెచ్చాడు. సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ ఇప్పటికే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
టిల్లు స్క్వేర్ తో 100 కోట్లు కొట్టేసరికి సిద్ధు సినిమాపై కూడా ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువ అయ్యాయి. జాక్ సినిమా ఆ ఎక్స్ పెక్టేషన్స్ అందుకోలేదు కాబట్టే సినిమా ఫ్లాప్ అయ్యింది. తెలుసు కదా సినిమా ఒక క్రేజీ లవ్ స్టోరీగా రాబోతుంది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది. సిద్ధు కూడా ఆ టిల్ల్య్ బోయ్ రోల్ నుంచి బయటకు వచ్చి చేశాడనిపిస్తుంది. సిద్ధుకి తెలుసు కదా తర్వాత మరో రెండు క్రేజీ సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి సితార బ్యానర్ లోనే చేస్తున్నాడని తెలుస్తుంది.
