సిద్ధు లైనప్ లోకి మరొకటా? ఈసారి ట్విస్ట్ ఏంటంటే?
టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం తన అప్‌కమింగ్ ప్రాజెక్టుల విషయంలో సరైన్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
By: M Prashanth | 26 March 2026 10:00 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం తన అప్‌కమింగ్ ప్రాజెక్టుల విషయంలో సరైన్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కమర్షియల్, రొమాంటిక్ కామెడీ కథలతో మంచి గుర్తింపు సంపాదించిన సిద్ధు… ఇకపై కాస్త భిన్నమైన స్టోరీలు ఎంపిక చేసుకోవాలనే టార్గెట్ తో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే విధంగా విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే సిద్ధు వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఆయన మూడు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వాటిలో ఒక సినిమాను కొత్త దర్శకుడు అనిల్ కుమార్ తెరకెక్కించనున్నారని సమాచారం. ఆ సినిమా కాన్సెప్ట్ పూర్తిగా కొత్తగా ఉండబోతుందని, సిద్ధు ఇప్పటివరకు చేయని తరహాలో కనిపించనున్నారని టాక్.
మరో ప్రాజెక్టును దర్శకుడు స్వరూప్ తో కలిసి చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కాంబినేషన్ లో వచ్చే సినిమా కూడా వినూత్నంగా ఉండబోతుందని అంచనా. టాలీవుడ్ లో అత్యంత విజయవంతమైన దర్శకుల్లో ఒకరితో సిద్ధు మరో ప్రాజెక్ట్ చేయబోతున్నాడనే సమాచారం కూడా ఉంది. అయితే ఆ దర్శకుడు ఎవరు అన్నది తెలియదు.
తాజాగా మరో ఆసక్తికరమైన అప్‌డేట్ కూడా వినిపిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందనుందని సమాచారం. ఆ ప్రాజెక్ట్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ గ్రాండ్ గా నిర్మించనున్నారని వినికిడి.
త్వరలోనే ఆ సిరీస్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వెంకీ అట్లూరి ఇప్పటికే తన సినిమాలతో మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనతో సిద్ధు చేయబోయే వెబ్ సిరీస్ పై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. సినిమా మాత్రమే కాకుండా ఓటీటీ కంటెంట్ లో కూడా తన మార్క్ చూపించాలని సిద్ధు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా చూస్తే, సిద్ధు లైనప్ లో మొత్తం ఐదు ప్రాజెక్టులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఆయన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న మరో సినిమాలో నటిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఆ చిత్రం పూర్తయిన తర్వాత ఆయన కొత్తగా లాక్ చేసిన ప్రాజెక్టుల్లో ఏదో ఒకటి ప్రారంభమయ్యే అవకాశముంది. ఏదేమైనా కమర్షియల్ హిట్లతో వచ్చిన ఇమేజ్ ను కాపాడుకుంటూనే.. కొత్త కథలతో తన కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో సిద్ధు ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. మరి కొత్త ప్రాజెక్టులు ఆయనకు ఎలాంటి ఫలితాలు తీసుకొస్తాయో చూడాలి.
