ఆ యంగ్ హీరో డాడీ రియల్ భారతీయుడు!
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ పరిచయం అవసరం లేని పేరు. `డీజే టిల్లు`, `టిల్లుస్క్వేర్` లాంటి విజయాలతో పాపులర్ అయిన నటుడు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగాడు.
By: Srikanth Kontham | 6 Oct 2025 1:00 PM ISTయంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ పరిచయం అవసరం లేని పేరు. 'డీజే టిల్లు', 'టిల్లుస్క్వేర్' లాంటి విజయాలతో పాపులర్ అయిన నటుడు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమై రచయితగా, నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. దాదాపు దశాబ్దం తర్వాత సక్సెస్ అయిన నటుడు. నేడు నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో `తెలుసు కదా` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
వీధిలో పులి..ఇంట్లో పిల్లి
తాజాగా ఓ సమావేశంలో సిద్దు తన తండ్రి గురించి కొన్ని ఆసక్తిర విషయాలు పంచుకున్నాడు. ఈ క్రమంలో సిద్దు వీధిలో పులి..ఇంట్లో పిల్లి అన్న సంగతి బయటపడింది. సిద్దు సినిమాలు చూసిన ఎవరైనా రియల్ లైఫ్ లోనూ ఇలాగే ఉంటాడా? అనిపిస్తుంది. అలాగే ఉంటాడు కాకపోతే అది ఇంటి గడప తొక్కనంత వరకే. ఇంట్లో కాలు పెట్టాడటంతే సైలైంట్ బోయ్ అని తెలుస్తోంది. అందుకు కారణం ఇంట్లో డాడ్ అని తెలుస్తోంది. తన తండ్రి బీఎస్ ఎన్ కంపెనీలో అధికారి కావడంతో పాటు నీతి నిజాయితీ గల అధికారి అని తెలుస్తోంది.
ఇష్టం లేకుండానే రికమండీషన్:
ఆయన దగ్గర ఎలాంటి రికమండీషన్లు పనిచేయవట. ఏ పని చేసి పట్టాలన్నా ఎకార్డింగ్ రూల్స్ మాట్లాడు తారని... ఆయన భారతీయుడు సినిమాలో మొదటి రకం కమల్ హాసన్ టైపు అన్నాడు. చిన్నప్పుడు సిద్దు స్కూల్ కి వెళ్తున్న సమయంలో తన తండ్రి బీఎస్ ఎన్ ఎల్ ఉద్యోగి కావడంతో? టీచర్ ఫోన్లకు ఇబ్బంది వస్తే డాడ్ బీఎస్ ఎన్ ఉద్యోగి కావడంతో అందరూ తన దగ్గరకు వచ్చి నాన్నతో మాట్లాడమనేవారుట. కానీ అలా మాట్లాడాలంటే? తనకు ఎంతో భయమని పైపైన మ్యానేజ్ చేసుకుంటూ వచ్చేవాడుట. ఎలాంటి సమస్య అయినా? తన తండ్రి వద్ద రూల్ ప్రకారం వెళ్లాలి తప్ప అడ్డదారులు అంటే? అస్సలు ఒప్పుకునేవారు కాదన్నాడు.
ప్యాన్సీ నెంబర్ కోసం పాట్లు:
ఒకే ఒక్కసారి బాగా పట్టుబడితే? తనకు సహాయం చేసారని..ఆ ఫేవర్ కూడా ఎంత మాత్రం ఇష్టలేకుండానే చేసేవారుట. కాలేజీ సమయంలో హెచ్ వోడీ బీఎస్ ఎన్ ఎల్ ప్యాన్సీ నెంబర్ కావాలని అడిగారు. ఎవరిని కలిస్తే పనవుతుందో? డైరెక్ట్ చేయమనే సలహా కోసం అడిగాను. ఆ తర్వాత ఆ వ్యక్తి కలిసొచ్చిన తర్వాత మీ నాన్నగారు అంటే ఎందుకంతా బయపడుతున్నారు అని వచ్చి చెప్పారు. సిద్దు తండ్రి కూడా చూడటానికి రీల్ భారతీ యుడులాగే ఉన్నారు. నెరిసిన జుట్టు ఆహార్యం అచ్చంగా అలాగే అనిపిస్తున్నారు.
