Begin typing your search above and press return to search.

ఘట్టమనేని ఫ్యామిలీలో గట్టిగా మోగనున్న పెళ్లి భాజాలు.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన మంజుల!

ఘట్టమనేని, గల్లా కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలైంది. దివంగత నటుడు కృష్ణ కుమార్తె పద్మావతి, గల్లా జయదేవ్ దంపతుల కుమారుడు సిద్ధార్థ్ గల్లా దక్షిణ కొరియాకు చెందిన హైన్‌ను వివాహం చేసుకోనున్నారు. ఈ క్రమంలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. మంజుల ఘట్టమనేని, నమ్రత వేడుకల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పెళ్లి తేదీ, వేదిక వివరాలు ఇంకా వెల్లడించలేదు.

By:  Madhu Reddy   |   14 Nov 2026 9:22 AM IST
ఘట్టమనేని ఫ్యామిలీలో గట్టిగా మోగనున్న పెళ్లి భాజాలు.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన మంజుల!
X

చిత్ర పరిశ్రమలో సందడి వాతావరణం నెలకొంది. సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే తేజా సజ్జ, సాయి ధరంతేజ్ వంటి యంగ్ హీరోలు వివాహానికి సిద్ధమవుతుండగా.. మరొకవైపు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, తన ప్రేయసి, హైదరాబాద్ సన్ రైజర్స్ సీఈవో కావ్య మారన్ ఇద్దరు గ్రీస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్నారు. ఇక మరొకవైపు ఇరుముడి హీరోయిన్ ప్రియా భవాని శంకర్ కూడా తన చిరకాల ప్రియుడితో ఏడడుగులు వేసింది. అయితే ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీలో కూడా పెళ్లి భాజాలు గట్టిగా మోగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రీ వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోలను అటు నమృత, ఇటు మంజుల ఘట్టమనేని తమ అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాల ద్వారా పంచుకున్నారు.




దివంగత సూపర్ స్టార్ కృష్ణ కూతురు పద్మావతి , మాజీ ఎంపీ గల్లా జయదేవ్ దంపతుల చిన్న కుమారుడు సిద్ధార్థ్ గల్లా తన ప్రేయసి, సౌత్ కొరియాకు చెందిన కొరియన్ అమ్మాయితో ఏడు అడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. ఈ ఏడాది జూలైలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత హల్దీ వేడుకను కూడా చాలా ఘనంగా జరిపారు. ఇక ఇప్పుడు పెళ్లి సమయం దగ్గర పడుతుండడంతో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఈ వేడుకలలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొని సందడి చేస్తున్నారు.




అటు సిద్ధార్థ్ గల్లా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో ఘట్టమనేని, గల్లా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫోటోలు ద్వారా తెలుస్తోంది. ఇందులో సాంప్రదాయ వస్త్రధారణలో కుటుంబ సభ్యుల ఫోటోలు, నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి. ఇండస్ట్రీ వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు సిద్ధార్థ్, హైన్ కాబోయే జంటకు ముందస్తుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే వివాహ తేదీ వేదిక గురించి కుటుంబం ఇంకా అధికారికంగా ప్రకటించలేద.




ఇకపోతే ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను మంజుల ఘట్టమనేని అభిమానులతో పంచుకుంటూ.. సిద్ధార్థ్, హైన్ తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. మా బాబాయ్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఏర్పాటు చేసిన ఒక చక్కని వివాహపూర్వ విందు మా కుటుంబం మొత్తాన్ని ప్రేమతో, సంతోషకరమైన జ్ఞాపకాలతో నిండేలా చేసింది. ముఖ్యంగా ఈ సాయంత్రం మా కుటుంబాలు ఒకచోట చేరి ఆనందపు క్షణాలను ఆస్వాదించాయి. ఇంత అద్భుతమైన సాయంత్రాన్ని అందించినందుకు, మమ్మల్ని అందరినీ ఒకచోట చేర్చినందుకు ధన్యవాదాలు. అంటూ మంజుల ఘట్టమనేని ఫోటోలను పంచుకుంది.




ఇందులో సిద్ధార్థ్, హైన్ అభిమానులను ఆకట్టుకున్నారు. అలాగే ఘట్టమనేని, గల్లా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఒకచోట చేరి ఆకట్టుకున్నారు. ఇకపోతే సిద్దార్థ్ గల్లా సోదరుడు అశోక్ గల్లా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సిద్దార్థ్ గల్లా మాత్రం ఇండస్ట్రీలోకి రాకుండా కుటుంబ వ్యాపారాలను చూసుకుంటూ బిజినెస్ వైపు అడుగులు వేశారు.