ఒక్క చిన్న రిప్లైతో మళ్లీ రగిలిన నార్త్- సౌత్ వార్
తాజాగా డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ చేసిన ఒక చిన్న కామెంట్ కూడా ఇదే తరహా డిస్కషన్ కు కారణమైంది.
By: Sravani Lakshmi Srungarapu | 20 Aug 2026 3:35 PM ISTసినిమా ఇండస్ట్రీల మధ్య పోటీ ఇప్పుడు కేవలం బాక్సాఫీస్ దగ్గరే ఆగిపోవడం లేదు. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలతో పాటు చిన్న కామెంట్లు కూడా భారీ డిస్కషన్స్‌కు దారితీస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్- టాలీవుడ్ మధ్య గత కొన్నేళ్లుగా కనిపిస్తున్న పోటీ భావన.. ఇలాంటి సందర్భాల్లో మరోసారి తెరపైకి వస్తోంది. తాజాగా డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ చేసిన ఒక చిన్న కామెంట్ కూడా ఇదే తరహా డిస్కషన్ కు కారణమైంది.
హైదరాబాద్ వేదికగా గతంలో జరిగిన ఓ సినిమా ఈవెంట్‌కు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో మరోసారి చక్కర్లు కొట్టింది. తెలుగు సినిమా ఫ్యూచర్, హైదరాబాద్ ప్రాధాన్యత, సౌత్ ఇండస్ట్రీ విస్తరణ వంటి అంశాలపై అప్పట్లో చేసిన కామెంట్స్ ను ఓ నెటిజన్ ప్రస్తావించాడు. ఈ సందర్భంగా ఫ్యూచర్ లో తెలుగు సినిమా ప్రభావం మరింత పెరగొచ్చనే అభిప్రాయాలు కూడా సోషల్ మీడియాలో డిస్కషన్‌కు వచ్చాయి.
అయితే ఆ వీడియోపై రియాక్ట్ అయిన మరో నెటిజన్.. గతంలో రిలీజైన కొన్ని భారీ తెలుగు సినిమాల ఫలితాలను ప్రస్తావిస్తూ తనదైన వాదనను ముందుకు తీసుకొచ్చాడు. భారీ అంచనాలతో వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోని సినిమాల పేర్లను ప్రస్తావిస్తూ, టాలీవుడ్ ఆధిపత్యంపై చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ డిస్కషన్‌లోకి బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ కూడా వచ్చి కామెంట్ చేయడంతో వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. నెటిజన్ చేసిన పోస్ట్ కు ఆయన ఊప్స్ అంటూ ఇచ్చిన చిన్న రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఒక్క పదంతో చేసిన ఈ రెస్పాన్స్ కు నెటిజన్లు తమ తమ అర్థాలను జోడిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, అసలు డిస్కషన్ మొదలైన అంశం కంటే, దానికి వచ్చిన చిన్న రియాక్షన్ గురించే ఇప్పుడు ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు. ఒకవైపు తెలుగు సినిమా దేశవ్యాప్తంగా సాధించిన మార్కెట్, మరోవైపు కొన్ని సినిమాల వైఫల్యాలను చూపిస్తూ చేసే వాదనలు.. రెండూ సోషల్ మీడియాలో పరస్పరం ఢీకొంటున్నాయి. బాహుబలి తర్వాత సౌత్ సినిమాలకు నార్త్ మార్కెట్‌లో పెరిగిన ఆదరణతో పాటు, పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు సాధిస్తున్న సక్సెస్‌లు ఈ డిస్కషన్ కు ప్రత్యేక నేపథ్యంగా మారాయి. అదే సమయంలో ప్రతి సినిమా సక్సెస్ ను అందుకోదు కాబట్టి, కొన్ని ఫ్లాపులను మొత్తం ఇండస్ట్రీ సామర్థ్యానికి కొలమానంగా చూడాలా అనే ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. మొత్తానికి.. ఓ వీడియో, ఓ నెటిజన్ కామెంట్, దానికి డైరెక్టర్ చేసిన ఒక చిన్న కామెంట్ వల్ల మరోసారి నార్త్–సౌత్ సినిమా డిస్కషన్ ను సోషల్ మీడియాలో వేడెక్కించాయి. సినిమా పోటీ కంటే సోషల్ మీడియా డిబేట్ మరింత హాట్‌గా మారుతున్న పరిస్థితికి ఇది మరో ఉదాహరణగా నిలిచింది.
