Begin typing your search above and press return to search.

అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ వేళ బోల్డ్ బ్యూటీపై రాజ‌కీయం?

ఈ నేప‌థ్యంలో పోటీ దారులంతా బ‌రిలో నిలిచారు. అందులో మాలీవుడ్ బోల్డ్ సంచ‌ల‌నం శ్వేతామీన‌న్ కూడా అధ్య‌క్ష ప‌ద‌వికి నామినేష‌న్ దాఖ‌లు చేసారు.

By:  Srikanth Kontham   |   7 Aug 2025 12:00 PM IST
అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ వేళ బోల్డ్ బ్యూటీపై రాజ‌కీయం?
X

అసోసియేష‌న్ ఆఫ్ మ‌ల‌యాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (అమ్మ) ర‌ద్దైన సంగ‌తి తెలిసిందే. అధ్య‌క్షుడు మోహ‌న్ లాల్ రాజీనామాతో అర్దం త‌రంగా సంఘం ర‌ద్దయింది. లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు నేప‌థ్యంలో పాల‌క మండ‌లి నైతిక బాధ్య‌త వ‌హిస్తూ రాజీనామాలు స‌మ‌ర్పించింది. అమ్మ‌లో కీల‌క ప‌ద‌వులు చేప‌ట్టిన వారంద‌రిపైనా లైంగిక ఆరోప‌ణ‌లు ప‌రాకాష్ణ‌కు చేర‌డమే ఇలాంటి అనిశ్చితికి దారి తీసింది. అప్ప‌టి నుంచి సంఘం ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేదు. ఇటీవ‌లే మ‌ళ్లీ నోటిపికేష‌న్ జారీ చేసి ఎన్నిక‌ల్ని ప్ర‌క‌టించింది.

పాత కేసునే తీసారా:

ఈ నేప‌థ్యంలో పోటీ దారులంతా బ‌రిలో నిలిచారు. అందులో మాలీవుడ్ బోల్డ్ సంచ‌ల‌నం శ్వేతామీన‌న్ కూడా అధ్య‌క్ష ప‌ద‌వికి నామినేష‌న్ దాఖ‌లు చేసారు. త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈనేప‌థ్యంలో శ్వేతామీన‌న్ పై పాత‌కేసును తవ్వి తీయ‌డం మాలీవుడ్ లో సంచ‌ల‌నంగా మారింది. శ్వేతా మీన‌న్ న‌టిం చిన సినిమాల్లో అభ్యంత‌ర‌కర‌ స‌న్నివేశాలున్నాయ‌ని, వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంపై కొన్ని రోజుల క్రిత‌మే పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు న‌మోదైంది. సామాజిక కార్య‌క‌ర్త మార్టిన్ ఫిర్యాదు చేసారు.

విచార‌ణ‌కు రంగం సిద్దం:

కానీ ఆ కేసును అప్పుడు పోలీసులు ప‌ట్టించుకోలేదు. మార్టిన్ కూడా త‌దుప‌రి చ‌ర్య‌ల‌కు దిగ‌లేదు. దీంతో కేసుపై ఎలాంటి అప్ డేట్ తెర‌పైకి రాలేదు. తాజాగా మార్టిన్ స‌రిగ్గా అమ్మ ఎన్నిక‌ల ముందు ఎర్నాకుళం కోర్టును ఆశ్ర‌యించ‌డం సంచ‌ల‌నంగా మారింది. డ‌బ్బు కోసం అడ‌ల్ట్ చిత్రాల్లో న‌టిస్తూ యువ‌త‌ను త‌ప్పు దోవ ప‌ట్టిస్తోన్న న‌టిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని...ఇలాంటి వాళ్ల‌ను సినిమాల‌ను నుంచి బ్యాన్ చేయాల‌ని కోర్టుకు స‌మ‌ర్పించిన పిటీష‌న్ లో పేర్కొన్నారు. దీంతో న్యాయ‌స్థానం పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులిప్పుడు శ్వేతామీన‌న్ పై విచార‌ణకు రంగం చేస్తున్నారు.

అన‌ర్హురాల‌నే ముద్ర వేయాల‌నే:

స‌రిగ్గా ఎన్నిక‌ల వేళ న‌టిపై కేసు విచార‌ణ ఆదేశంపై శ్వేతా మీన‌న్ అన‌నూయులు దీన్నో రాజ‌కీయ క్ష‌క్ష‌గా ప‌రిగ‌ణిస్తున్నారు. అమ్మ వ‌ర్గంలోని స‌భ్యులే బ్యాకెండ్ లో ఈ రాజ‌కీయానికి తెర తీసిన‌ట్లు ఆరోపిస్తున్నారు. స‌భ్యురాలిగా శ్వేతా మీన‌న్ కు ఉన్న బ‌లాన్ని బ‌ల‌హీన‌త‌గా మార్చ‌డం కోసం ప‌న్నిన ప‌న్నాగంగా పేర్కొ న్నారు. అధ్య‌క్ష ప‌ద‌వికి అన‌ర్హురాలి అనే ముద్ర వేయాల‌నే ఎత్తుగ‌డ‌తో సంఘంలోనే ప్ర‌త్య‌ర్దులే ఈ ర‌క మైన చ‌ర్య‌ల‌కు దిగుతున్నార‌ని ఆరోపించారు.

శ్వేతా మీన‌న్ కంటే ముందే ష‌కీలా:

శ్వేతా మీన‌న్ పై ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం కొత్తేం కాద‌ని...ఆమె సినిమాల‌కు సంబంధించి గ‌తంలోనూ కొంత మంది ప‌నిగ‌ట్టుకుని నెగిటివ్ ప్ర‌చారం చేయించార‌న్న అంశాన్ని ప్ర‌స్తావించారు. ఈ కేసుకు సంబం ధించి శ్వేతామీన‌న్ ఇంకా స్పందించ‌లేదు. ఈ ఆరోప‌ణ‌ల్ని శ్వేతా మీన‌న్ ఎలా తిప్పి కొడుతుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అడ‌ల్ట్ చిత్రాల న‌టీమ‌ణులపై ఇలాంటి వివాదాలు కొత్తేం కాదు. గ‌తంలో ష‌కీలా కూడా ఇలాంటి ఆరోప‌ణ‌లు ఎన్నో ఎదుర్కుంది. ఆమె కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో స్టార్ హీరోలే ఆమెపై ఆరోప‌ణ‌లు చేసారు. మార్కెట్ లో ష‌కీలా సినిమాలు స్టార్ హీరోల‌కు పోటీగా మార‌డంతో? ఆమె ఎదు గుద‌ల‌ను ఓర్వ‌లేని కొంద‌రు వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌కు దిగిన‌ట్లు అప్ప‌టి మీడియాలో ప్ర‌త్యేక క‌థ‌నాలే ప్ర‌చార మ‌య్యాయి.