Begin typing your search above and press return to search.

గ్లామ‌ర్ ప‌రిశ్ర‌మ‌లో భర్తలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య‌లు!

ప్రముఖ టీవీ నటి శ్వేతా తివారీ తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.

By:  Sivaji Kontham   |   9 Aug 2026 4:50 PM IST
గ్లామ‌ర్ ప‌రిశ్ర‌మ‌లో భర్తలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య‌లు!
X

ప్రముఖ టీవీ నటి శ్వేతా తివారీ తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానున్న `ది ట్రేటర్స్ సీజన్ 2` ప్రోమోలో హోస్ట్ కరణ్ జోహార్‌తో మాట్లాడుతూ శ్వేతా తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. అబద్ధాలను పసిగట్టే నైపుణ్యం తనకు ఉందా అనే ప్రశ్న రాగా.. తన ఇద్దరు మాజీ భర్తలు తప్పుదోవ పడుతుండగా తానే స్వయంగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని బహిరంగంగా చెప్పడంతో ఈ షో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.

శ్వేతా తివారీ వ్యాఖ్యలతో పాటు సినీ - బుల్లితెర పరిశ్రమలలో భర్తల పరస్త్రీ వ్యామోహాన్ని, మోసాలను భార్యలు బహిర్గతం చేసిన పలు పాత సంఘటనలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సినీ రంగానికి చెందిన నటీమణులు తమ జీవిత భాగస్వాములు వేరే మహిళలతో సన్నిహితంగా ఉన్న సమయంలో పట్టుకుని, పోలీసుల వరకు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. విడాకులు, వైవాహిక బంధాల ముగింపునకు ఇవే ప్రధాన కారణాలుగా మారుతున్నాయని పరిశ్రమలో చర్చ జరుగుతోంది.

టాలీవుడ్, మాలీవుడ్‌లలో కూడా ఇటువంటి వివాదాలు గతంలో సంచలనం సృష్టించాయి. హైదరాబాద్‌లోని ఒక ఫ్లాట్‌లో తన భర్త మరొక మహిళతో ఉండగా ఒక ప్రముఖ తెలుగు బుల్లితెర నటి పట్టుకోవడం.. ఆపై రచ్చ జరిగి పోలీసులు ఎంట్రీ ఇవ్వడం అప్పట్లో మీడియాలో పెద్ద వార్తగా మారింది. అలాగే మలయాళ సీరియల్ నటి కూడా తన భర్తను వేరే మహిళతో ఉన్న సమయంలో ఆధారాలతో పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాలీవుడ్‌లో వివాదం అప్ప‌ట్లో పెద్ద చ‌ర్చ‌గా మారింది.

కన్నడ (శాండల్‌వుడ్) , తమిళ (కోలీవుడ్) చిత్ర పరిశ్రమలలోనూ పలువురు నటుల వైవాహిక వివాదాలు రచ్చకెక్కిన సందర్భాలు ఉన్నాయి. భర్తల పరస్త్రీ వ్యామోహంపై కన్నడ నటీమణులు బహిరంగంగానే నిలదీయడం లేదా కేసులు పెట్టడం జరిగాయి. ఇక తమిళ వెండితెర, బుల్లితెరలకు చెందిన పలువురు నటులు తమ సహనటీమణులతో సంబంధాలు నడుపుతున్నప్పుడు భార్యలు నేరుగా పట్టుకుని.. మీడియా ముందే వారిపై ఆరోపణలు చేసిన సంఘటనలు కోలీవుడ్‌లో నమోద‌య్యాయి.

ఇప్పుడు శ్వేతా తివారీ వ్యాఖ్యలపై మాజీ భర్త ఇటీవల స్పందిస్తూ ఆరోపణలను ఖండించడం గమనార్హం. శ్వేతానే తన సహనటుడితో సంబంధంలో ఉందంటూ ఆయన ప్రత్యారోపణలు చేశారు. ఏది ఏమైనా గ్లామర్ ప్రపంచంలో వెలుగు చూసే ఈ వైవాహిక మోసాలు, ఎక్స్‌ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ వార్తలు సోషల్ మీడియాలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తూ ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి.