సుశాంత్ సింగ్ మరణంపై సోదరి సంచలన వ్యాఖ్యలు
ముఖ్యంగా సుశాంత్ సింగ్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి ఇటీవల జర్నలిస్ట్ శుభంకర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేందుకు ఆస్కారం లేదని, అతడిని ఇద్దరు కలిసి చంపారని వ్యాఖ్యానించారు.
By: Sivaji Kontham | 31 Oct 2025 6:22 PM ISTనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకుని మరణించాడని దర్యాప్తు సంస్థలు డిక్లేర్ చేసి కేసును ముగించాయి. ఈ కేసు నుంచి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు నిరపరాధులుగా బయటపడ్డారు. వారికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా ఇప్పటికీ అతడి ఆత్మహత్యను కుటుంబీకులు అంగీకరించలేకపోతున్నారు. ముఖ్యంగా సుశాంత్ సింగ్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి ఇటీవల జర్నలిస్ట్ శుభంకర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేందుకు ఆస్కారం లేదని, అతడిని ఇద్దరు కలిసి చంపారని వ్యాఖ్యానించారు. అమెరికాలో ఒకరు, ముంబైలో మరొకరు ఇద్దరు మానసిక నిపుణులు తన సోదరుడిని ఇద్దరు వ్యక్తులు హత్య చేశారని తనకు స్వయంగా వెల్లడించినట్టు చెప్పారు.
బాంద్రాలోని తన ప్లాట్ లో ఉరి వేసుకున్న ఫ్యాన్ కు మృతదేహం ఉన్న దూరానికి ఎక్కడా పొంతన లేదని, ఇది చూస్తే ఆత్మ హత్యకు ఆస్కారమే కనిపించలేదని మానసిక నిపుణులు చెప్పినట్టు శ్వేతా సింగ్ వాదిస్తున్నారు. వారి ప్రకారం సుశాంత్ సింగ్ ను ఇద్దరు వ్యక్తులు హత్య చేశారని శ్వేతా సింగ్ ఆరోపించారు.
అంత ఎత్తులోని ఫ్యాన్ కు ఉరి వేసుకోవాలంటే ఒక స్టూల్ లాంటిది వాడాలి. కానీ అక్కడ ఎలాంటి స్టూల్ లేదు. శరీరంపై ఉన్న గుర్తులను చూసాను.. అవి దుపట్టా గుర్తుల్లా కనిపించలేదు. అతడు ఉపయోగించాడని చెబుతున్న వస్తువు తాలూకా గుర్తులు కూడా లేవు. ఒక సన్నని గొలుసు లాంటి గుర్తు మాత్రమే ఉంది... దీనివల్ల తనను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నట్టు శ్వేతాసింగ్ వ్యాఖ్యానించారు. అయితే మానసిక నిపుణులు చెప్పారు అనేదానికి శ్వేతాసింగ్ ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు.
