Begin typing your search above and press return to search.

శృతిహాసన్‌ చిల్లింగ్‌ మూమెంట్‌ వీడియో

కమల్‌ హాసన్‌ నట వారసురాలు అయినప్పటికీ శృతి హాసన్‌ సొంతంగానే తనకంటూ బ్రాండ్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.

By:  Ramesh Palla   |   21 Nov 2025 12:43 AM IST
శృతిహాసన్‌ చిల్లింగ్‌ మూమెంట్‌ వీడియో
X

కమల్‌ హాసన్‌ నట వారసురాలు అయినప్పటికీ శృతి హాసన్‌ సొంతంగానే తనకంటూ బ్రాండ్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో శృతి హాసన్‌ కి ఒక ప్రత్యేక శైలి ఉందని అంతా అంటారు. ఆమె కేవలం ఒక హీరోయిన్‌ మాత్రమే కాకుండా, మల్టీ ట్యాలెంట్‌తో పలు సార్లు తానేంటో నిరూపించుకుంది. ఇటీవల మహేష్‌ బాబు - రాజమౌళి కాంబోలో రూపొందుతున్న వారణాసి సినిమా కోసం పాట పాడటం ద్వారా వార్తల్లో నిలిచింది. అంతే కాకుండా వారణాసి ఈవెంట్‌లోనూ లైవ్‌ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సాధారణంగా హీరోయిన్స్‌ స్టేజ్ పై డాన్స్ చేసేందుకు ఆసక్తి చూపించరు. అంతటి సాహసం చాలా తక్కువ మంది మాత్రమే చేస్తారు. కానీ శృతి హాసన్ మాత్రం ఆ సాహసం చేసింది. తాను మల్టీ ట్యాలెంటెడ్‌ అని దీంతో మరోసారి అందరికి చెప్పకనే చెప్పింది అంటూ ఆమె అభిమానులు అంటున్నారు.

సోషల్‌ మీడియాలో శృతి హాసన్‌...

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శృతి హాసన్‌ ఆ మధ్య కాస్త దూరంగా జరిగింది. సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టకుండా ఉంటాను అని తనకు తాను స్వీయ నియంత్రణ చేసుకుంది. కానీ చివరకు మళ్లీ సోషల్‌ మీడియాలో రీ ఎంట్రీ ఇచ్చింది. చిన్న బ్రేక్ తీసుకున్న శృతి హాసన్‌ ను చాలా మంది ఆ సమయంలో రీ ఎంట్రీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దాంతో ఆమె రీ ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చిందని అంటారు. ముందులాగే శృతి హాసన్‌ రెగ్యుల్‌గా ఫోటోలు, వీడియోలను షేర్‌ చేస్తూ ఉంది. సాధారణంగా స్టార్‌ హీరోయిన్స్ కేవలం తమ యొక్క గ్లామర్‌ ఫోటోలను మాత్రమే షేర్‌ చేస్తూ ఉంటారు. కానీ శృతి హాసన్ మాత్రం రెగ్యులర్‌గా తన యొక్క డైలా రొటీన్‌ ఫోటోలు వీడియోలను షేర్‌ చేయడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా తన హెయిర్‌ డ్రెస్సర్‌తో ఉన్న ఒక వీడియోను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది.

హీరోయిన్‌గా శృతి హాసన్‌ సినిమాలు...

హెయిర్‌ స్టైలిస్ట్‌ నూరితో ఉన్న సరదా వీడియోను శృతి హాసన్‌ షేర్ చేసింది. ఒక షూటింగ్‌ సందర్భంగా నూరితో ఈమె టైం స్పెండ్‌ చేసింది. హెయిర్‌ డ్రెస్‌ చేస్తున్న సమయంలోనే వీడియోను తీసి దాన్ని ఇన్‌స్టాలో షేర్‌ చేయడం ద్వారా తనతో వర్క్‌ చేసే వారితో శృతి ఎంత జోవియల్‌గా, సరదాగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి మనసున్న వ్యక్తి శృతి హాసన్‌ అంటూ పలువురు ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరితో చాలా సరదాగా ఉండే శృతి హాసన్‌ అదే తీరును సోషల్‌ మీడియాలో తన పోస్ట్‌ల ద్వారా చెప్పకనే చెబుతుంది. కొందరు సెలబ్రిటీలు తమతో వర్క్‌ చేసే వారిని కెమెరాలో కనిపించకుండా జాగ్రత్త పడుతారు. కానీ శృతి హాసన్ తానే స్వయంగా వారిని వీడియో తీసి ఇలా సోషల్‌ మీడియాలో పెట్టడం ద్వారా వారికి గుర్తింపు వచ్చేలా చేస్తుందని అంటున్నారు.

వారణాసి సినిమా కోసం పాట

నూరికి హెయిర్‌ స్టైలిస్ట్‌గా దీంతో తప్పకుండా మంచి గుర్తింపు లభిస్తుందని చాలా మంది అంటున్నారు. ఆమె సోషల్‌ మీడియా ప్రొఫైల్‌ను కూడా శృతి హాసన్‌ ట్యాగ్‌ చేయడం ద్వారా ఆమెకు మరింతగా ఫాలోవరస్ రావడం జరుగుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తండ్రి తగ్గ కూతురు అనిపించుకుంటూనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు గౌరవంను సొంతం చేసుకున్న శృతి హాసన్‌ ఇలాంటి మంచి పనుల కారణంగా మరో మెట్టు ఎక్కినట్లు అవుతుంది. యూనివర్శల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ తన తండ్రి అనే ట్యాగ్‌ ను ఎక్కడ కూడా శృతి హాసన్ ఉపయోగించుకోదు. కెరీర్‌ ఆరంభంలో ఆ పేరు ఆమెకు ఏమైనా పనికి వచ్చిందేమో కానీ ఆ తర్వాత ఎక్కడ కూడా తండ్రి పేరును ఆమె వాడుకోదు అని ఆమె సన్నిహితులు చెబుతూ ఉంటారు.