Begin typing your search above and press return to search.

శ్రుతిహాస‌న్ ఇంట్లో పూజ‌లు పున‌స్కారాలు ఉండ‌వా?

క‌మ‌ల్ హాస‌న్ కూడా ఆచారాలు పాటించ‌రు. దేవుళ్లు..దెయ్యాలు గురించి టాపిక్ ను ఆయ‌న ట‌చ్ చేయ‌రు. ప‌లు సంద‌ర్భాల్లో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కూడా వివాదాస్ప‌ద‌మ‌య్యాయి.

By:  Srikanth Kontham   |   28 Oct 2025 5:00 AM IST
శ్రుతిహాస‌న్ ఇంట్లో పూజ‌లు పున‌స్కారాలు ఉండ‌వా?
X

శ్రుతి హాస‌న్ కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళ‌, హిందీ సినిమాల‌తో బిజీ బిజీగా ఉంది. విజ‌యాల ప‌రంగా వెనుక‌బ‌డినా అవ‌కాశాల ప‌రంగా కొద‌లేదు. ఏదో ప‌రిశ్ర‌మ‌లో సినిమాలు చేస్తోంది. `వాల్తేరు వీర‌య్య‌`తో మాస్ హిట్ అందుకోగా అటుపై `స‌లార్` మ‌రో విజ‌యం ఖాతాలో వేసుకుంది. ఇత‌ర భాష‌ల్లో కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇటీవ‌లే `కూలీ`తో అల‌రించింది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్-సౌత్ ఇండ‌స్ట్రీ మ‌ధ్య వ్య‌త్యాసం చెప్పే ప్ర‌య‌త్నం చేసింది. సౌత్ ప‌రిశ్ర‌మ‌లో తార‌లు ఎంతో విన‌యంతో ఉంటారంది.

`ఇక్క‌డ సంస్కృతి సంప్ర‌దాయాల‌కు ప్రాధాన్య‌త ఇస్తారు. సినిమా ప్రారంభోత్స‌వం రోజున దేవుడి ప‌టాల ముందు కొబ్బ‌రి కాయ‌లు కొట్ట‌డం..దేవుళ్ల‌కు న‌మ‌స్క‌రించ‌డం..మ‌న‌సులో కోరిక‌లు కోరుకోవ‌డం.. పూజ‌లు చేయ‌డం వంటివి క‌నిపిస్తాయి. సౌత్ లో అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో ఇలా క‌నిపిస్తుంది. ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన కొత్త‌లో నాకు ఇదంతా చాలా కొత్త‌గా అనిపించేదంది. `ఎందుకంటే మా ఇంట్లో అలా చేయ‌డం ఎప్పుడూ చూడ‌లేదు. ఆచారాల‌ను మా ఇంట్లో వారు ఎవ‌రు న‌మ్మ‌రు. పూజ‌లు..పున‌స్కారాలు పెద్ద‌గా ఉండ‌వు. కానీ ప్ర‌తీ విష‌యంలోనూ క్ర‌మ శిక్ష‌ణ ఉంటుందంది.

సౌత్ లో ఉన్న‌ట్లు ఈ ర‌క‌మైన క‌ల్చ‌ర్ బాలీవుడ్ లో పెద్ద‌గా క‌నిపించ‌దన్నారు. చాలా త‌క్కువ మంది మాత్ర‌మే చేస్తారని, హిందీ సినిమాలు చేస్తున్న‌ప్పుడే ఈ రెండు ప‌రిశ్ర‌మ‌ల మ‌ధ్య వ్య‌త్య‌సం తెలిసిందన్నారు. సౌత్ లో బాగా డ‌బ్బు సంపాదించిన‌ వారు కూడా చాలా పద్ద‌తులు పాటిస్తుంటారు. వారు ఇప్ప‌టికీ అదే పాత ప‌ద్ద‌తి కొన‌సాగించ‌డం చూస్తుంటే వీరు ఇంకా పాత అంబాసిడ‌ర్ కారులోనే ప్ర‌యాణిస్తున్నారా? అనిపిస్తుంద‌న్నారు. ఆడంబ‌ర‌మైన వ‌స్తువుల‌తో త‌మ విజ‌యాన్ని నిరూపించుకోవాల‌నుకోరంది.

క‌మ‌ల్ హాస‌న్ కూడా ఆచారాలు పాటించ‌రు. దేవుళ్లు..దెయ్యాలు గురించి టాపిక్ ను ఆయ‌న ట‌చ్ చేయ‌రు. ప‌లు సంద‌ర్భాల్లో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కూడా వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌నే డిమాండ్ వ్య‌క్త‌మైనా? క‌మ‌ల్ మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌లేదు. తాను న‌మ్మిన సిద్దాంతానికే క‌ట్టుబ‌డి ఉంటారు.క‌మ‌ల్ లాగే త‌నయ శ్రుతి హాస‌న్ కూడా ఉంటుంద‌ని ఆమె మాట‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది.