Begin typing your search above and press return to search.

తల్లిదండ్రుల బంధంపై శృతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తల్లిదండ్రులు కమల్ హాసన్, సారిక విడిపోయినా.. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమాభిమానాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని శ్రుతి హాసన్ వెల్లడించారు. కలిసి ఉన్నప్పుడు ఇద్దరూ ఎంతో ప్రేమగా, సరదాగా పనిచేసేవారని గుర్తుచేసుకున్నారు. స్టార్ కిడ్స్ అయినా తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచారని తెలిపారు. సంప్రదాయ వివాహాలపై తనకు నమ్మకం లేదని, జీవితానికి తోడు మాత్రం అవసరమని శ్రుతి స్పష్టం చేశారు.

By:  Srikanth Kontham   |   17 Nov 2026 3:30 PM IST
తల్లిదండ్రుల బంధంపై శృతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
X

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ధాంపత్య జీవితాల గురించి తెలిసిందే. ఆయ‌న తొలివివాహం వాణి గ‌ణ‌ప‌తితో జ‌రిగింది. కానీ కొంత కాలానాకి విబేధాలు రావ‌డంతో విడిపోయారు. అనంత‌రం బాలీవుడ్ న‌టి సారిక‌ను రెండ‌వ వివాహం చేసుకున్నారు. వీరికి పుట్టిన బిడ్డ‌లే శ్రుతి హాస‌న్..అక్ష‌ర హాస‌న్. అయితే కొంత కాలానికి సారిక‌తోనూ మ‌న‌స్ప‌ర్ద‌లు రావ‌డంతో విడాకులు తీసుకున్నారు. అయినా కుమార్తెల విష‌యంలో క‌మ‌ల్ ఎంతో బాధ్య‌త‌గా వ్య‌వహరించారు. భార్య భ‌ర్త‌లుగా విడిపోయినా త‌ల్లిదం డ్ర‌లుగా మాత్రం బిడ్డ‌లిద్ద‌ర‌కి ప్రేమ‌ను అందించారు.

తాజాగా క‌మ‌ల్ -సారిక మ‌ధ్య బంధం ఎలా ఉండేద‌న్న‌ది శ్రుతిహాస‌న్ తొలిసారి రివీల్ చేసారు. `నా తల్లిదండ్రులు కలిసి లేరనే విషయం అందరికీ తెలుసు. కానీ వారు కలిసి ఉన్నంత కాలం వారి మధ్య గొప్ప ప్రేమ ఉండేది. ఒకరితో ఒకరు చాలా సరదాగా కలిసి పనిచేయడాన్ని ఎంతో ఆస్వాదించేవారు. చిన్నప్పుడే వారిని చూసి నాకు ఓ ఆలోచన కలిగింది.. భవిష్యత్తులో నాకు బాయ్‌ఫ్రెండ్ లేదా భర్త వస్తే మేము కూడా వారిలాగే కలిసి కొత్త విషయాలను నిర్మించుకోవాలి. కలిసి పనిచేయాలి అనుకునేదాన్ని` అంటూ మనసులోని మాటను బయటపెట్టారు.

సెలబ్రిటీల పిల్లలుగా పెరిగినా? తమకు ఎప్పుడూ విలాసవంతమైన జీవితం అందలేదని శృతి గుర్తు చేసుకున్నారు. స్టార్ కిడ్స్ అనే కార‌ణంతో చెడిపోకూడదనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా పెంచారన్నారు . ముఖ్యంగా స్కూల్ రోజుల్లో ఏది అడిగినా కమల్ హాసన్ వెంటనే కొనిచ్చేవారు కాదని.. ఆ క్రమశిక్షణ విలువ ఏంటో పెరిగే కొద్దీ అర్థమైందని శ్రుతి తెలిపారు. వ్యక్తిగత జీవితం ..పెళ్లి ఆలోచనలపై కూడా శృతి క్లారిటీ గా మాట్లాడారు.

పెళ్లి పేరుతో జరిగే డాక్యుమెంట్ పనులు.. విపరీతమైన ఖర్చులు.. ఆడంబరాలపై తనకు పెద్దగా నమ్మకం లేదన్నారు. జీవితానికి తోడు అవ‌స‌ర‌మేన‌న్నారు. కానీ సంప్రదాయ వివాహ చట్రంలో మాత్రం ఇమడలేనని తెలిపారు. ఇక శ్రుతి సినిమాల విష‌యానికి వ‌స్తే? అమ్మ‌డికి కొంత కాలంగా హీరోయిన్ అవ‌కాశాలు త‌గ్గిన‌ట్లే క‌నిపిస్తోంది. స్టార్ హీరోల చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు..ఐటం పాట‌ల్లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.

`కూలీ`లో కీల‌క పాత్ర‌.. ఆత‌ర్వాత `సైలెంట్ స్క్రీమ్స్` అనే డాక్యుమెంట‌రీలో న‌టించింది. అలాగే `పెద్ది`లో స్పెష‌ల్ సాంగ్ చేసింది. ప్రస్తుతం `ఆకాశంలో ఒక‌తార` చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషిస్తుంది. త‌మిళ్ లోనే `ట్రైన్` అనే సినిమాలో న‌టించింది. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. కానీ ఇంత వ‌ర‌కూ రిలీజ్ అవ్వ‌లేదు. దీనికి సంబంధించి అప్ డేట్ కూడా లేదు.