ట్రోల్స్‌కి శృతి హాసన్ భలే సమాధానం...
ఈ మధ్య కాలంలో శృతి హాసన్ ఆఫర్లు కోల్పోయింది. ఆమె మెల్ల మెల్లగా ఫేడ్ ఔట్ కాబోతుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
By: Ramesh Palla | 22 Oct 2025 3:48 PM ISTయూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని వుడ్స్‌లోనూ గుర్తింపు దక్కించుకుంది. అయితే కెరీర్ ఆరంభంలో మాత్రం శృతి హాసన్ చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంది. ముఖ్యంగా శృతి హాసన్ ను ఐరెన్ లెగ్ అని కూడా పిలిచారు. పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ ఎప్పుడు అయితే విజయాన్ని సొంతం చేసుకుందో, ఆ సినిమాతో శృతి హాసన్ విజయాన్ని సొంతం చేసుకుందో అప్పటి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు చేయడం ఆమెకే చెల్లింది. అన్ని భాషల్లో గుర్తింపు ఉన్న హీరోయిన్స్ కొద్ది మంది మాత్రమే ఉంటారు. కానీ శృతి హాసన్ అన్ని భాషల్లోనూ ఆఫర్లు వచ్చాయి, అక్కడ ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకుని, ఫ్యాన్స్‌ను ఏర్పాటు చేసుకున్న విషయం తెల్సిందే.
శృతి హాసన్ సోషల్ మీడియా పోస్ట్
శృతి హాసన్ సినిమాల ఎంపిక విషయంలో ఆమె ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు. సినిమాలో ఉన్నామా అంటే ఉన్నాము అన్నట్టుగా చాలా సినిమాలు ఆమె చేసింది. కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్‌కు పరిమితం కాగా, కొన్ని సినిమాల్లో ఒకటి రెండు డైలాగ్స్‌కు పరిమితం అయింది అంటూ విమర్శించే వారు చాలా మంది ఉన్నారు. అయినా కూడా శృతి హాసన్ తన తీరును మార్చుకోవడం లేదు. తన సినిమాల ఎంపిక విషయంలో కొత్తగా నిర్ణయాలు ఏమీ తీసుకోవడం లేదు. తనకు వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం తన ముందు ఉన్న లక్ష్యం అన్నట్లుగా శృతి హాసన్ చెప్పుకొచ్చింది. ఈ మధ్య కాలంలో ఆమె నుంచి వచ్చిన కూలీ సినిమా విషయంలోనూ మళ్లీ విమర్శలు ఎదుర్కొంది. మోనికా పాటలో కనిపించిన పూజా హెగ్డే స్థాయిలో కూడా శృతి హాసన్ పాత్రకు గుర్తింపు దక్కలేదు అని చాలా మంది విమర్శలు చేశారు.
మేకప్ రూంలో శృతి హాసన్
ఈ మధ్య కాలంలో శృతి హాసన్ ఆఫర్లు కోల్పోయింది. ఆమె మెల్ల మెల్లగా ఫేడ్ ఔట్ కాబోతుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ కామెంట్స్‌కు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో మూడు ఫోటోలు షేర్ చేయడం ద్వారా తన సమాధానం చెంప పగల కొట్టినట్టుగా గట్టిగా ఇచ్చింది. శృతి హాసన్ దోశ ఫోటోను షేర్ చేసి దోశ = లైఫ్ అన్నట్లుగా పోస్ట్ చేసింది. తనకు లైఫ్ అంత ప్రాధాన్యం దోశకు ఇస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మేకప్ రూంలో వర్కింగ్ మూడ్ అంటూ ఫోటోను షేర్ చేసింది. ఆ సమయంలోనే తనను విమర్శించిన వారిని ఎగతాళి చేసినట్లుగా ఫోటోను షేర్ చేయడం ద్వారా శృతి హాసన్ అందరి దృష్టిని ఆకర్షించింది. మొత్తానికి శృతి హాసన్ తనదైన శైలిలో ట్రోల్స్‌కి ఇలా సమాధానం ఇవ్వడం చర్చనీయాంశం అయింది.
సలార్ 2 కోసం వెయింటింగ్
చివరగా జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫోటోను షేర్ చేసి తాను లైఫ్‌ను చాలా సంతోషంగా గడుపుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. చాలా సంతోషంగా ఉన్నాను అన్నట్లుగా ఆమె చెప్పడం ద్వారా ఎప్పుడూ తాను ట్రోల్స్‌ని పట్టించుకోను అన్నట్లుగా చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం ఈమె చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు పెద్ద హీరోల సినిమాలు కాగా, కొన్ని చిన్న హీరోల సినిమాలు సైతం శృతి హాసన్ చేయబోతుంది. సలార్ 2 సినిమాలో ఈమె పాత్ర చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుందని అంటున్నారు. అంతే కాకుండా విజయ్ సేతుపతితో కలిసి చేస్తున్న సినిమా, మరో రెండు సినిమాలు సైతం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇంత బిజీగా ఉన్న శృతి హాసన్‌ను కెరీర్ ఖతం అన్నట్లుగా పుకార్లు పుట్టించే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందని నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.
