జిప్సీ డ్రేప్ సెట్ లో శృతిహాసన్ కొత్త అందాలు..
సినిమాలతోనే కాదు ఫ్యాషన్ సెన్స్ తో కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్న అతి కొద్ది మంది సెలబ్రిటీస్ లో శృతిహాసన్ కూడా ఒకరు .
By: Madhu Reddy | 8 Sept 2026 2:06 PM ISTసినిమాలతోనే కాదు ఫ్యాషన్ సెన్స్ తో కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్న అతి కొద్ది మంది సెలబ్రిటీస్ లో శృతిహాసన్ కూడా ఒకరు . కమల్ హాసన్ కూతురిగా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె తన తండ్రి ఇన్ఫ్లుయెన్స్ తో కాకుండా సొంత టాలెంట్ తో ఎదిగింది. నిత్యం సోషల్ మీడియాలో ఆకట్టుకుంటూ ఏదో ఒక అవుట్ ఫిట్ తో ఆడియన్స్ ను అలరించే ఈమె.. తాజాగా జిప్సీ డ్రేప్ సెట్ తో ఆకట్టుకుంది.
ఈ మేరకు ఇంస్టాగ్రామ్ వేదిక పంచుకున్న ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. శృతిహాసన్ ధరించిన ఈ లేటెస్ట్ అవుట్ ఫిట్ విషయానికి వస్తే.. లేబుల్ మోని కె అనే ఫ్యాషన్ బ్రాండ్ డిజైన్ చేసిన ఈ జిప్సీ డ్రిప్ సెట్ ను ఈమె ధరించింది. ప్రకాశవంతమైన ఊదా, గులాబీ రంగుల కలయికలో రూపొందించిన ఈ కార్సెట్.. బాడీకి అణువుగా సూట్ అయింది రంగురంగుల పూసలు, సీక్విన్ లతో ఎంబ్రాయిడరీ చేసిన ఈ కార్సెట్ ఈమె అందాన్ని రెట్టింపు చేసింది. ఇక దీనికి జతగా ముదురు ఊదా రంగులో కింది వరకు శాటిన్ క్లాత్ తో డిజైన్ చేసిన స్కర్ట్ ధరించింది. నాజుకైన నడుము భాగంతో ఆధునిక ఇండో - వెస్ట్రన్ రూపాన్ని పూర్తి చేసింది శృతిహాసన్.
ఇకపోతే దీని ధర సుమారుగా రూ.24 వేల నుండి రూ.25 వేల వరకు ఉంటుంది . ఫ్యాషన్ ప్రియులకు ఇది పెద్ద ధర కాదు అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి అయితే శృతిహాసన్ లేటెస్ట్ అవుట్ ఫిట్ తో ఆడియన్స్ హృదయాలను దోచుకుంది. ఇందులో ఆమె లుక్ మాత్రమే కాదు తన మేకోవర్ ను సింపుల్ జువెలరీ , చక్కటి హెయిర్ స్టైల్ తో ఫుల్ ఫీల్ చేసుకుంది. పైగా ఈ ఫోటోలకు క్యాప్షన్ గా కొన్ని ఎమోజిస్ కి కూడా పంచుకుంది. అలా. ప్రవీణ్ రాజా స్టైల్ చేసిన ఈ లుక్.. శ్రేయ అద్దిన మేకప్.. అత్రాంగి డిజైన్ చేసిన జువెలరీ ఈమె అందాన్ని రెట్టింపు చేసేసాయి.
శృతిహాసన్ విషయానికి వస్తే.. గాయనిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. అంతకుముందు కమలహాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన హే రామ్ అనే చిత్రంలో బాల నటిగా తన కెరీర్ను ప్రారంభించింది. చిన్నప్పటినుండి సంగీతంపై శ్రద్ధ వహించిన ఈమె .. సింగర్ గా కూడా మంచి పేరు సొంతం చేసుకుంది. 2008లో సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన లక్ సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన నటిగా తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. సినిమా డిజాస్టర్ అయినా.. తన నటనతో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. తెలుగులో అనగనగా ఓ ధీరుడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. గబ్బర్ సింగ్తో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది . సలార్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా పేరు దక్కించుకున్న ఈమె.. ప్రస్తుతం ఆకాశంలో ఒక తార చిత్రంతోపాటు ట్రైన్, చెన్నై స్టోరీ వంటి చిత్రాలలో కీలకపాత్రలు పోషిస్తోంది
