బాలీవుడ్ క్రమశిక్షణారాహిత్యంపై పంచ్
ఒకరిని పొగడటం అంటే ఇంకొకరిని తిట్టడం కాదు! కానీ ఇక్కడ శ్రుతిహాసన్ దక్షిణాది చిత్రసీమ గురించి ప్రశంసలు కురిపించిన తీరు కచ్ఛితంగా హిందీ చిత్రసీమతో పోలికలు, లోపాలను బహిర్గతం చేసింది.
By: Sivaji Kontham | 27 Oct 2025 1:00 PM ISTఒకరిని పొగడటం అంటే ఇంకొకరిని తిట్టడం కాదు! కానీ ఇక్కడ శ్రుతిహాసన్ దక్షిణాది చిత్రసీమ గురించి ప్రశంసలు కురిపించిన తీరు కచ్ఛితంగా హిందీ చిత్రసీమతో పోలికలు, లోపాలను బహిర్గతం చేసింది. దక్షిణాది పరిశ్రమలో ప్రతిదీ క్రమశిక్షణతో నడిపిస్తారు. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయం గొప్పవి. కొబ్బరి కాయ కొట్టి, పూజలు పునస్కారాలతో సినిమాల ప్రారంభోత్సవాలు ఘనంగా చేస్తారు. సాంప్రదాయాలు ఆచారాలను నమ్ముతారు. ఇక్కడ వినయం గౌరవంలో తగ్గరు. సెట్లో నియమాలను అందరూ పాటిస్తారని హిందీ పరిశ్రమలో ఇలాంటివి చూడలేదు అని తెలిపారు.
నిజానికి కొంత కాలంగా హిందీ చిత్రసీమలో క్రమశిక్షణా రాహిత్యం గురించి చాలా చర్చ సాగుతోంది. స్టార్లకు ఇష్టానుసారం ఆలస్యంగా సెట్స్ కి వచ్చే అలవాటు ఉంది. అభినవ్ కశ్యప్ లాంటి దర్శకుడు పదే పదే ఖాన్ ల త్రయం క్రమశిక్షణా రాహిత్యం గురించి విమర్శిస్తున్నారు. క్వీన్ కంగన రనౌత్ చాలా సందర్భాల్లో ఉత్తరాది అగ్ర హీరోల ఆధిపత్య ధోరణి, మనస్తత్వంపై చాలా చెణుకులే వేసారు. దక్షిణాది పరిశ్రమలో గౌరవం ఇచ్చి పుచ్చుకునే విధానం గురించి, వర్క్ కల్చర్ గురించి ప్రశంసలు కురిపించిన కంగన, ఉత్తరాది స్టార్ల క్రమశిక్షణా రాహిత్యాన్ని దెప్పి పొడిచింది.
ఇటీవల అనురాగ్ కశ్యప్ సైతం ఉత్తరాది పరిశ్రమలో క్రమశిక్షణ- సరైన నడవడిక లేకపోవడం వల్ల సౌత్ కి వచ్చేశానని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఇక్కడే నటిస్తూ, దర్శకుడిగాను కొనసాగుతున్నారు. ఇటీవల ఓ సినిమా మేకింగ్ విషయంలో తలమునకలుగా ఉన్నారు కశ్యప్.
ప్రేమ.. పని... ఉద్యోగం గురించి నిజాయితీగా మాట్లాడితే సమాజం హర్షించదని కూడా శ్రుతి వ్యాఖ్యానించింది. నిజం మాట్లాడితే ఎదుటివారిని జనం వేలెత్తి చూపిస్తారని పేర్కొంది. తన కాస్మోటిక్ సర్జరీల గురించి నిజాయితీగా బహిరంగంగా మాట్లాడినందుకు జనం ఇలానే ప్రవర్తిస్తారని అంది. బయట ఎవరో ఏదో అనుకుంటారని నన్ను నేను మార్చుకోలేను.. నాలాగే నేను ఉంటాను! అని తెలిపింది.
