ప్రభాస్ తో సినిమా అనగానే ఇంత బిల్డప్ ?
మొత్తానికి తొలుత కాస్త బిల్డప్ ఇచ్చినా? ప్రభాస్ వ్యక్తిత్వం, గొప్పతనం గురించి తెలిసిన తర్వాత అమ్మడు రియలైజ్ అయినట్లు తెలుస్తోంది.
By: Srikanth Kontham | 4 Jan 2026 7:00 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా ఛాన్స్ అనగానే ఏ నటి అయినా ఎగిరి గంతెస్తుంది. తనంత గొప్ప అదృష్ట వంతురాలు మరొకరు ఉండరనే అనుభూతికి లోనవుతారు. డార్లింగ్ తో పని చేయడానికి ఎంతో ముందుకొస్తారు. కానీ శ్రుతిహాసన్ ప్రభాస్ తో ఛాన్స్ అనగానే ఎలా రియాక్ట్ అయిందో? తెలుసా? అయితే ఏంటి! అన్నట్లే అమ్మడి నుంచి తొలి రియాక్షన్ వచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. `సలార్` చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా లో ఛాన్స్ రాగానే ఈ విషయం శ్రుతిహాసన్ స్నేహితులకు లీక్ అవ్వడంతో ఫోన్ చేసి మరీ ఎంతో ఎగ్జైట్ మెంట్ కు గురయ్యారుట.
మరికొంత మంది డార్లింగ్ తో నటిస్తున్నావ్? అని సంతోషం వ్యక్తం చేసారుట. కానీ ఆ ఎగ్జైట్ మెంట్ గానీ, సంతోషంగానీ శ్రుతిహాసన్ లో ఎంత మాత్రం కలగలేదుట. అంతా కీర్తిస్తుంతుంటే? శ్రుతిహాసన్ ఎంతో ఇబ్బందిగా పీలైందిట. అయితే ఎవరికి గొప్ప అన్నట్లు మాట్లాడిందిట. కానీ ప్రభాస్ గురించి తెలిసిన తర్వాత తాను అలా అనుకుని చాలా పెద్ద తప్పు చేసానని రియలైజ్ అయిందిట. షూటింగ్ ప్రారంభమైన వారం రోజులకే అందరూ ప్రభాస్ ని డార్లింగ్ అని ప్రేమతో ఎందుకు పిలుస్తారో? తనకీ అర్దమైందంది. అతడు నిజంగానే డార్లింగ్ అంది.
అప్పటి నుంచి ప్రభాస్ తో సరదగా ఉండటం..క్లోజ్ గా మూవ్ అవ్వడం చేసినట్లు గుర్తు చేసుకుంది. సెట్ లో ఉన్నప్పుడు ప్రభాస్ తో జనరల్ నాలెడ్స్ గురించి, సంగీతం గురించి ఎక్కువగా మాట్లాడేదాన్ని అంది. తాను చెప్పింది ప్రభాస్ ఎంతో ఓపికగా వినేవారు అంది. ఓసారి మాటల్లో నటుడిని కాకపోయి ఉంటే మాత్రం రోజంతా పుల్లుగా తింటూనే ఉండేవాడిని అని శ్రుతిహాసన్ తో అన్నాడుట ప్రభాస్. డార్లింగ్ అలా మాట్లాడుతుంటే ఎంతో ముచ్చటేసిందని...ఎలాంటి కల్మశం లేని మంచి వ్యక్తి అని తెలిపింది.
మొత్తానికి తొలుత కాస్త బిల్డప్ ఇచ్చినా? ప్రభాస్ వ్యక్తిత్వం, గొప్పతనం గురించి తెలిసిన తర్వాత అమ్మడు రియలైజ్ అయినట్లు తెలుస్తోంది. `సలార్` తర్వాత శ్రుతి హాసన్ మరో తెలుగు సినిమా చేయలేదు. తమిళ్ లో కూడా బిజీగా లేదు. ఈ మధ్యనే రిలీజ్ అయిన `కూలీ` సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది. ఆ సినిమా కూడా అంచనాలు అందుకోలేదు. ప్రస్తుతం `ట్రైన్` అనే ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. అలాగే `సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం`లోనూ నటిస్తుంది. మొదటి భాగంలో శ్రుతి హాసన్ పాత్ర కీలకమైందే? కానీ చాలా తక్కువ సన్నివేశాల్లో కనిపిస్తుంది. మరి పార్ట్ 2 లో ఎంత ప్రాధాన్యత ఉంటుందో చూడాలి.
