Begin typing your search above and press return to search.

సర్జరీ గురించి శ్రుతి హాసన్ నిజం చెప్తే..

సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేసిన శ్రుతి హాసన్ సైతం కెరీర్ ఆరంభంలోనే కాస్మొటిక్ సర్జరీ చేయించుకుంది.

By:  Garuda Media   |   28 Oct 2025 1:00 AM IST
సర్జరీ గురించి శ్రుతి హాసన్ నిజం చెప్తే..
X

సినిమాల్లోకి వచ్చే హీరో హీరోయిన్లు మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు చిన్న చిన్న సర్జరీలు చేసుకోవడం ఎప్పట్నుంచో ఉన్నదే. కొందరు ఈ విషయంలో ఓపెన్‌గా నిజాలు చెబుతారు. కొందరు దాపరికం పాటిస్తారు. కానీ కెరీర్ ఆరంభమైనపుడు.. తర్వాత లుక్స్ చూస్తే మార్పు స్పష్టంగా తెలిసిపోతుంది. బాలీవుడ్ హీరోయిన్లలో ముఖం మీద కత్తి గాటు పడని తక్కువమందే అని చెప్పాలి. ఇలాంటి సర్జరీలు చేయించుకుని అందాన్ని దెబ్బ తీసుకున్న వాళ్లు కూడా ఉన్నారు.

సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేసిన శ్రుతి హాసన్ సైతం కెరీర్ ఆరంభంలోనే కాస్మొటిక్ సర్జరీ చేయించుకుంది. కెరీర్ మొదట్లో చేసిన లక్, అనగనగా ఒక ధీరుడు చిత్రాలతో పోలిస్తే తన లుక్‌లో మార్పు స్పష్టంగా గమనించవచ్చు. ఐతే తాను కాస్మొటిక్ సర్జరీ చేయించుకున్న విషయాన్ని శ్రుతి ఏమీ దాచిపెట్టలేదు. కానీ నిజం బయటపెట్టినందుకు తాను తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చిందని, జనం దారుణమైన మాటలు అన్నారని ఒక ఇంటర్వ్యూలో శ్రుతి వాపోయింది.

‘‘నేను కాస్మొటిక్ సర్జరీ చేయించుకున్న విషక్ష్ాన్ని దాచిపెట్టలేదు. దాని గురించి ఓపెన్‌గానే చాలాసార్లు మాట్లాడాను. కానీ దీని మీద చాలామంది నెగెటివ్ కామెంట్లు చేశారు. ఈమె ప్లాస్టిక్ సర్జరీల దుకాణం.. అంటూ విమర్శలు చేశారు. నిజాయితీగా ఉన్నందుకు నేను చెల్లించిన మూల్యం అది. కానీ ఏం చేశానో.. ఎలా చేశానో నాకు మాత్రమే తెలుసు.

మనం మన పనిలో అయినా.. వ్యక్తిగత జీవితంలో అయినా.. ప్రేమలో ఉన్నపుడైనా నిజం మాట్లాడితే వేలెత్తి చూపేవాళ్లే ఎక్కువగా ఉ:టారు. అయినా ఎవరు ఏమనుకుంటారో అని పట్టించుకోకుండా నేను నాలా ఉండడానికే ప్రయత్నిస్తా’’ అని శ్రుతి చెప్పింది. తాను సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ నటించానని.. కానీ సౌత్‌లో స్టార్లు చాలా వినయంగా, గౌరవభావంతో ఉంటారని.. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారని.. వాళ్ల లైఫ్ స్టైల్ కూడా సింపుల్‌గా ఉంటుందని శ్రుతి అభిప్రాయపడింది.