పీసీ, శృతి, జాన్వీ, శిల్ప, అనుష్క.. ఔను అయింది!
నటి శ్రుతిహాసన్ తన కాస్మెటిక్ సర్జరీ గురించి తాజాగా ఓపెన్ అయ్యారు. నేహా ధూపియా, అంగద్ బేడీల ‘డబుల్ డేట్’ టాక్ షోలో మాట్లాడుతూ, తనలో వచ్చిన మార్పులను సహజమైనవని చెప్పడం కంటే నిజం ఒప్పుకోవడమే మంచిదని అన్నారు. గతంలో జాన్వీ కపూర్ కూడా నోస్ సర్జరీ చేయించుకున్నట్లు వెల్లడించారు. ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ తదితరులు కూడా సర్జరీల గురించి గతంలో మాట్లాడారు.
By: Ramesh Palla | 14 Nov 2026 11:00 PM ISTఒకప్పుడు హాలీవుడ్‌కి మాత్రమే పరిమితం అయిన కాస్మెటిక్ సర్జరీ గత పదేళ్ల కాలంలో ఇండియన్ సెలబ్రిటీల్లోనూ మొదలైంది. ఎంతో మంది హీరోయిన్స్, కొందరు హీరోలు కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నారు. కొందరు తాము సర్జరీ చేయించుకున్నట్లుగా ఓపెన్‌గానే చెబుతూ ఉంటే, కొందరు మాత్రం మాకు ఆ అవసరం లేదని, సహజ పద్దతిలోనే అందంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ లో కొందరు సర్జరీ చేయించుకున్నట్లు క్లీయర్‌గా కనిపిస్తూ ఉన్నా, ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నప్పటికీ సర్జరీ చేయించుకున్నట్లుగా మాత్రం ఒప్పుకోవడం లేదు. కొందరు మాత్రం ఎలాంటి భయం లేకుండా తమ బాడీ తమ ఇష్టం, సర్జరీ చేయించుకోవడం అనేది వ్యక్తిగత విషయం. దాన్ని గురించి ఇతరులు విమర్శలు చేసినంత మాత్రాన సీక్రెట్‌గా ఉంచాల్సిన అవసరం ఏంటని ఎదురు ప్రశ్నిస్తూ ఔను సర్జరీ చేయించుకున్నాం అని చెబుతున్నారు.
శృతి హాసన్ సర్జరీ గురించి...
కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నాం అని బాహాటంగా చెబుతున్న వారిలో తాజాగా శృతి హాసన్ సైతం చేరింది. ఇటీవలే జాన్వీ కపూర్ సైతం తాను కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నట్లు ప్రకటించింది. అంతుకు ముందు సర్జరీ విషయమై మీడియాలో ప్రచారం జరిగినప్పుడు సైలెంట్‌గా ఉన్న జాన్వీ కపూర్ ఆ మధ్య ఒక చిట్ చాట్ లో ఓపెన్ అయింది. తన తల్లి ఆధ్వర్యంలో సర్జరీ చేయించుకున్నట్లుగా జాన్వీ కపూర్ చెప్పింది. తన తల్లి మొదట ఒప్పుకోలేదని, సర్జరీ తర్వాత ఆమె సంతోషించింది అంటూ జాన్వీ కపూర్ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ సమయంలో జాన్వీ కపూర్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇంత ఓపెన్‌గా జాన్వీ కపూర్ సర్జరీ గురించి చెప్పడం నిజంగా ఆశ్చర్యంగా ఉందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జాన్వీ కపూర్ తన నోస్ కు సర్జరీ చేయించుకున్నట్లు చెప్పుకొచ్చింది. తాజాగా శృతి హాసన్ సైతం సర్జరీ గురించి ఓపెన్ అయింది.
బాలీవుడ్ టాక్ షో ....
ఈమధ్య కాలంలో బాలీవుడ్‌లో నేహా ధూపియా, అంగద్ బేడీల షో డబుల్ డేట్ లో కనిపించిన సెలబ్రిటీల గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఆ షో లో చాలా బోల్డ్ విషయాలను రాబడుతున్నారు. అంతే కాకుండా చాలా విషయాలు, ముఖ్యంగా ఇంతకు ముందు తెలియని విషయాలను ఈ టాక్ షో లో రాబడుతున్నారు. తాజాగా శృతి హాసన్ ఈ షోలో పాల్గొంది. ఆమె చిట్ చాట్ లో తన కాస్మెటిక్ సర్జరీ గురించి ఓపెన్ అయింది. సర్జరీ గురించి శృతి హాసన్ మాట్లాడుతూ... కొందరు సర్జరీ చేయించుకున్న విషయాన్ని దాచి పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ నేను పుట్టింది, పెరిగింది అంతా జనాలు చూశారు. మధ్యలో ఒక మార్పు వస్తే దాన్ని సహజంగా వచ్చిందని చెప్పిన జనాలు నమ్మరు. సడెన్‌గా వచ్చిన మార్పును వారు కచ్చితంగా గుర్తిస్తారు. అలాంటప్పుడు అబద్దం చెప్పాల్సిన అవసరం ఏంటని శృతి హాసన్ చెప్పుకొచ్చింది.
ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ...
అందరికీ తెలిసిన విషయాన్ని అబద్దం అని చెప్పడంలో అర్థం లేదని తాను భావిస్తున్నాను అని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. ఇలా సర్జరీ విషయాన్ని ఓపెన్‌గా చెప్పడం నిజంగా గ్రేట్ అంటూ ఆమె ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శృతి హాసన్‌కి నోస్ అండ్ లిప్స్ కి సర్జరీ జరిగిందట. గతంతో పోల్చితే శృతి హాసన్ చాలా అందంగా కనిపించడానికి సర్జరీ హెల్ప్ అయిందని ఆమెను అభిమానించే వారు అంటారు. ఇంకా సర్జరీ చేయించుకున్నట్లు ఒప్పుకున్న జాబితాలో ప్రియాంక చోప్రా, శిల్పా చక్రవర్తి, అనుష్క శర్మ, ఖుషి కపూర్, కోయినా మిత్రాలు సైతం సర్జరీ చేయించుకున్నట్లు ఒప్పుకున్నారు. సర్జరీ తర్వాత తమపై తమకు నమ్మకం ఏర్పడి ఇండస్ట్రీలో ధైర్యంగా నెగ్గుకు వస్తున్నామని వాళ్ళు చెబుతున్నారు. కొందరు మాత్రం ఇప్పటికీ తాము చేయించుకున్న కాస్మెటిక్ సర్జరీని ఒప్పుకోవడం లేదు. వారి జాబితా పెద్దగానే ఉంది.
