Begin typing your search above and press return to search.

ఇళ్లు..కార్లు..ఆస్తులు కాదు మొత్తం అక్క‌డే ఊదేస్తారా?

కోట్ల‌కు కోట్లు డ‌బ్బు ఎవరి ద‌గ్గ‌రుంది? అంటే వ్యాపార వేత్త‌ల సంగ‌తేమెగానీ! సినిమా వాళ్ల ద‌గ్గ‌ర‌..రాజ‌కీయ నాయ‌కులు ద‌గ్గ‌ర ఉంద‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతుంటారు.

By:  Srikanth Kontham   |   23 Aug 2025 9:55 AM IST
ఇళ్లు..కార్లు..ఆస్తులు కాదు మొత్తం అక్క‌డే ఊదేస్తారా?
X

కోట్ల‌కు కోట్లు డ‌బ్బు ఎవరి ద‌గ్గ‌రుంది? అంటే వ్యాపార వేత్త‌ల సంగ‌తేమెగానీ! సినిమా వాళ్ల ద‌గ్గ‌ర‌..రాజ‌కీయ నాయ‌కులు ద‌గ్గ‌ర ఉంద‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతుంటారు. సినిమా వాళ్లు ఎంత సంపాదిస్తారో? అంతే ఖ‌ర్చులుంటాయి. గ్లామ‌ర్ పీల్డ్ లో రాణించాలంటే ఆ మాత్రం ఖ‌ర్చు త‌ప్ప‌నిస‌రి. ల‌గ్జ‌రీ లైఫ్ స్టైల్.. ఖ‌రీదైన కార్లు..బంగళాలు ఇవ‌న్నీ వారి స్థాయికి త‌గ్గ‌ట్టు ఉంటాయి. అందుకోసం కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తుంటారు. ఈ విష‌యంలో సెల‌బ్రిటీలు ఎక్క‌డా త‌గ్గ‌రు. మార్కెట్ లోకి వ‌చ్చే కొత్త కొత్త ల‌గ్జ‌రీ కార్ల‌ను కొన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు.

సంపాద‌న‌కంటే పొగొట్టుకున్న‌దే ఎక్కువ‌:

భ‌వంతుల విష‌యంలో అంతే అడ్వాన్స్ గా ఉంటారు. డ‌బ్బుకు డబ్బు ఎంత సేఫ్ మార్గంలో వస్తుందో అన్వేషిస్తారు. మ‌రికొంత మంది సెల‌బ్రిటీలు వ్యాపార రంగంలో క‌నిపిస్తుంటారు. కానీ విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాసన్ మాత్రం ఇలాంటి వారికి భిన్నం. ఆయ‌న ఖ‌రీదైన కార్లు కొన‌రు. విల్లాల జోలికి అస‌లే వెళ్ల‌రు. భూములు కొన‌డం ..విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం ఇవేవి ఆయన‌కు ఎంత మాత్రం తెలియ‌వ‌ని కుమార్తె శ్రుతిహాస‌న్ తెలిపింది. ఆయ‌న‌కు తెలిసింద‌ల్లా సొంత బ్యాన‌ర్లో సినిమాలు నిర్మించి పొగొట్ట‌డ‌మే అని న‌వ్వేసింది.

కొత్త విషయాలంటే అమితాస‌క్తి:

కొత్త కాన్సెప్ట్ తో బ్యాన‌ర్ ని అప్రోచ్ అయిన వారిని ప్రోత్స హించ‌డం..టెక్నిక‌ల్ కంటెంట్ ఉన్న క‌థ‌లో కోసం డ‌బ్బును మంచి నీళ్ల‌లా ఖ‌ర్చు చేయ‌డం నాన్న‌కు బాగా తెలుసంది. సినిమా హిట్ అయితే వ‌చ్చిన లాభాలు దాచుకోవ‌డం...స్థిర చ‌రాస్తులు కొన‌డం లాంటివి అస్స‌లు తెలియంది. సినిమాల ద్వారా ఆయ‌న సంపాదించిన దానికంటే పోగొట్టుకున్న‌దే ఎక్కువ అంది. డ‌బ్బు శాశ్వ‌తం కాద‌న్న‌ది క‌మ‌ల్ హాస‌న్ గ‌ట్టిగా న‌మ్ముతారంది. ఇంట్లో చాలా సాధార‌ణ జీవితాన్నే ఇష్టప‌డ‌తారంది. అలాగే సాంకేతిక ప‌రంగా కొత్త విషయాలు తెలుసుకోవ‌డానికి ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తారంది.

బ్యాలెన్సింగ్ నాకూ చెబుతారు:

అక్క‌డ కూడా డ‌బ్బు ఎక్కువ‌గానే ఖ‌ర్చు చేస్తార‌ని తెలిపింది. సాంకేతిక అంశాలంటే ఆయ‌న‌కు ఈ వ‌య‌సులో కూడా చాలా ఆస‌క్తిగా ఉంటారంది. వ‌య‌సు మీద ప‌డే కొద్ది ఎవ‌రికైనా కొత్త విష‌యాలు తెలుసుకోవాలంటే ఆస‌క్తి చూపించ‌రు. చెప్పినా ప‌ట్టించుకోరు. కానీ క‌మ‌ల్ హాస‌న్ మాత్రం త‌న‌కు తాను గానే స్వయంగా తెలుసుకుని వీలైనంత వ‌ర‌కూ త‌న స‌న్నిహితుల‌కు చేర‌వేసే ప్ర‌య‌త్నం చేస్తారంది. త‌న‌లాగే అంద‌రూ కూడా అన్ని విష‌యాలు తెలుసుకోవాల‌ని త‌పించే వ్య‌క్తిగా పేర్కొంది. అలాగే జ‌యాప‌జ‌యాలు క‌మ‌ల్ ని ఎంత మాత్రం ప్ర‌భావితం చేయ‌లేవ‌ని తెలిపింది. రెండింటిని ఒకేలా తీసుకోవ‌డం చాలా కాలం క్రిత‌మే అల‌వాటైంద‌న్నారు. త‌న‌ని కూడా స‌క్సెస్ పెయిల్యూర్ ని బ్యాలెన్స్ చేయ‌డం నేర్చుకోవాల‌ని సూచిస్తారంది.