శ్రుతిహాసన్ కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా?
శ్రుతి హాసన్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో తాను మల్టీట్యాలెంటెడ్ బ్యూటీ అని కెరీర్ ఆరంభంలోనే చాటి చెప్పింది.
By: Srikanth Kontham | 18 April 2026 10:19 AM ISTశ్రుతి హాసన్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో తాను మల్టీట్యాలెంటెడ్ బ్యూటీ అని కెరీర్ ఆరంభంలోనే చాటి చెప్పింది. లెజెండ్ కమల్ హాసన్ వారసురాలిగా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన అమ్మడు
అంచలంచెలుగా ఎదిగింది. సౌత్ సహా బాలీవుడ్ లోనూ అనతి కాలంలోనే సినిమాలు చేసి అన్ని పరిశ్రమల్లోనూ తనదైన ముద్ర వేసింది. వ్వక్తిగత జీవితంలోనే శ్రుతిహాసన్ ప్రేమాయణాలు నడపడంలోనూ తక్కువేం కాదని ప్రూవ్ చేసింది. తొలుత విదేశీయుడు మైఖెల్ కోర్సలేతో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసింది. అతడినే పెళ్లాడాలనుకుంది.
ఈ క్రమంలో మైఖెల్ ను డాడ్ కు సైతం పరిచయం చేసింది. కానీ ఎందుకనో ఆ బంధం పెళ్లి వరకూ దారి తీయలేదు. అటుపై కొంత గ్యాప్ తీసుకుని ముంబైకి చెందిన శంతను హాజారికాతోనూ డేటింగ్ చేసింది. తొలి వైఫల్యం నేపథ్యంలో శంతను పెళ్లాడుతుందని అంతా భావించారు. కానీ ఈ బంధం కూడా మధ్యలోనే వీగిపోయింది. అప్పటి నుంచి అమ్మడు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వృత్తిగత జీవితంపైనే దృష్టి పెట్టింది. సినిమాలు తప్ప మరో ఆలోచన లేకుండా పని చేస్తోంది. ఈ నేపథ్యంలో శ్రుతి హాసన్ గురించి ఓ వార్త కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కమల్ హాసన్ తన గారాల పట్టి కోసం సరైన వరుడిని వెతికే పనిలో పడ్డారని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంబంధాలు చూసారని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా వ్యక్తిగత విషయాలపై చాలా స్పష్టంగా ఉండే కమల్ కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రుతి హాసన్‌కు ఇప్పటికే 40 ఏళ్లు నిండాయి. పెళ్లి విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా కమల్ బలమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్ తన మిత్రులు, బంధువుల ద్వారా మంచి సంబంధాలను అన్వేషి స్తున్నారుట.
బయట కుర్రాడు కంటే? తెలిసిన కుర్రాడైతే బాగుంటుందనే క్రమంలోనే కమల్ తెలిసిన వాళ్ల ద్వారా పెళ్లి కొడుకును వెతుకుతున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత జీవితంలో కూడా కమల్ హాసన్ చాలా సవాళ్లు ఎదుర్కు న్నారు. వివాహం అనే జీవితంలో కమల్ చాలా కుదుపులకు లొనయ్యారు. మొదటి భార్యతో విడాకులు ..ఆ తర్వాత నటి గౌతమ్ తో రిలేషన్ షిప్ వీగిపోవడం తెలిసిందే. ప్రస్తుతం కమల్ కూడా సింగిల్ గానే ఉంటున్నారు. సాధారణంగా పెళ్లి విషయంలో కమల్ హాసన్ ఇష్టాలను..స్వేచ్ఛ ను ఎంతో గౌరవిస్తారు. శ్రుతి హాసన్ కి కూడా కమల్ చాలా స్వేచ్ఛ కల్పించారు. ఆ రకంగా శ్రుతి హాసన్ కూడా కొంత జీవితాన్ని ఆస్వాదించింది. కానీ గత అనుభవాల దృష్ట్యా కుమార్తెల పెళ్లి విషయంలో మాత్రం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని కమల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
