కూలీ కథ మొత్తం ఆ పాత్ర చూట్టూనే..
శృతి హాసన్. లోక నాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
By: Sravani Lakshmi Srungarapu | 6 Aug 2025 5:56 PM ISTశృతి హాసన్. లోక నాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గబ్బర్ సింగ్ సినిమాతో టాలీవుడ్ లో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న శృతి ఆ తర్వాత పలు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విషయం తెలిసిందే. అలాంటి శృతికి మధ్యలో కాస్త ఆఫర్లు కరువయ్యాయి.
కూలీలో కీలక పాత్రలో శృతి
మళ్లీ ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమాతో ఓ గుర్తుండిపోయే పాత్రను చేసింది. ఇప్పుడు రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన కూలీ సినిమాలో శృతి ఓ పాత్ర చేసింది. అలా అని శృతి ఈ మూవీలో హీరోయినా అంటే కాదు. కానీ కూలీలో శృతి పాత్ర మాత్రం చాలా కీలకమని తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే కథ మొత్తం ఈమె పాత్ర చుట్టూనే తిరుగుతుందని కోలీవుడ్ వర్గాలంటున్నాయి.
సత్యరాజ్ కూతురి పాత్రలో..
కూలీ మూవీలో శృతి క్యారెక్టర్ కు ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా, సినిమాలో అమ్మడి గ్లామర్ షో లేకపోయినా కథలోని కీలక ట్విస్టులన్నీ శృతి ద్వారానే రివీలవుతాయని అంటున్నారు. అదే నిజమైతే శృతికి చాలా మంచి పాత్ర దక్కినట్టవుతుంది. ఈ మూవీలో శృతి, సత్యరాజ్ కు కూతురిగా నటిస్తోంది. సత్యరాజ్ హార్బర్ లో జరిగే మాఫియా, అక్కడి సీక్రెట్స్ ను బయట పెట్టాలని చూస్తుంటారు.
అక్కడే సత్యరాజ్‌కు, రజినీకాంత్ కు ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతుందని, ఆ తర్వాత జరిగిన కొన్ని సిట్యేయేషన్స్ వల్ల వారిద్దరూ కనిపించకుండా పోతారు. శృతి తన తండ్రిని వెతుకుతున్న టైమ్ లోనే విలన్ అయిన నాగార్జున గురించి అందరికీ తెలుస్తోందని, తన గురించి తెలుసుకున్న శృతిని చంపాలని నాగార్జున టీమ్ ప్రయత్నాలు చేయడం, ఆ ప్రయత్నాల్ని బెడిసికొడుతూ రజినీ రీఎంట్రీ ఇవ్వడం ఉంటుందట.
సైలెంట్ గా ఉంటున్న లోకేష్
తండ్రిని వెతుకుతున్న శృతికి అతని ఫ్రెండ్ కనిపించడం, ఆ తర్వాత వారిద్దరూ కలిసి సత్యరాజ్ ను వెతకడం ఇదే కూలీ కథగా తెలుస్తోంది. ఇందులో నిజమెంతన్నది పక్కన పెడితే కూలీ నుంచి ట్రైలర్ రిలీజయ్యాక దాన్ని చూసి ఒక్కొక్కరు ఒక్కోలా కథను అల్లుతూ వార్తలు పుట్టిస్తున్నారు. ఇవన్నీ చూస్తూ కూడా లోకేష్ రెస్పాండ్ అవకపోవడం సినిమాపై ఇంకా ఆసక్తిని పెంచుతుంది. ఆగస్ట్ 14న కూలీ సినిమా రిలీజ్ కానుండగా అదే రోజు దీనికి పోటీగా వార్2 కూడా రిలీజవుతోంది.
