విశ్వనటుడితోనే డాటర్ ని పోలుస్తున్నారా?
విశ్వ నటుడు కమల్ హాసన్ ఎంత గొప్ప నటుడు అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఆయన నటనను దేశమే మెచ్చింది.
By: Srikanth Kontham | 27 Oct 2025 7:00 PM ISTవిశ్వ నటుడు కమల్ హాసన్ ఎంత గొప్ప నటుడు అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఆయన నటనను దేశమే మెచ్చింది. ప్రపంచ దేశాల నటుల్లోనూ కమల్ కు ప్రత్యేకమైన పేరు , గుర్తింపు ఉంది. అందుకే విశ్వ నటుడు అయ్యాడు. ఎలాంటి పాత్ర అయినా? అవలీలగా పోషించగలరు. ఆయన పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తే ఆ పాత్రకే వన్నే తేగలరు. అంత గొప్ప లెజెండ్ అతడు. అలాంటి నట వారసత్వం స్పూర్తితోనే కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అనతి కాలంలోనే దక్కించుకుంది.
హీరోలంతా జంకినా? హీరోయిన్ మాత్రం దైర్యంగా:
తమిళం, తెలుగు, హిందీ అంటూ ముడు భాషల్లోనూ పని చేసింది. `ది ఐ` తో హాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజాగా శ్రుతి హాసన్ తన నటనని తండ్రి నటనతో పోల్చుకోవడం ఆసక్తికరం. శ్రుతి హాసన్ నటనను చాలా మంది తన తండ్రి నటనతో పోలుస్తారని తెలిపింది. కమల్ వారసురాలిగా వెండి తెరకు పరిచయమైన నేపథ్యంలో ఆ ప్రభావం తనపై ఉంటుందని అభిప్రాయపడింది. అయితే ఇలా పోలిక చేయడం వల్ల శ్రుతి హాసన్ ఎత మాత్రం ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదంది. సాధారణంగా తండ్రులతో తనయుల్ని పోల్చుకోవడానికి ఇష్టపడరు. తండ్రి పేరు చెడగొట్టకుండా ఉండే చాలు అనే మాట వినిపిస్తుంది.
డాడ్ తో పోలిక వావ్ అనేసిన నటి:
కానీ శ్రుతి హాసన్ అందుకు భిన్నం. కమల్ నటనతో పోల్చడం తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని..అలా అనడం వల్ల తాను ఎంత మాత్రం అసౌకర్యంగా బావించనంది. అలాంటి పోలిక తాను ఎంతగానోన ఇష్టపడతానంది. తండ్రి స్పూర్తితో ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చారని..తాను కూడా అలా వచ్చిన నటిగానే పేర్కొంది. తండ్రిని చూసే ఎన్నో విషయాలు తెసుకున్నానని..ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం కమల్ నుంచే వచ్చిందన్నారు.
ఇంకొన్ని పాత విషయాల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవితో సమానంగా చరణ్ భావిస్తామంటే ఎంత మాత్రం ఒప్పుకోరు. ఆయన స్థాయి ఏంటి? తన స్థానం ఏంటి? అని వ్యత్యాసం చూపిస్తారు.
రెండు చిత్రాలతో బిజీ:
అలాగే సూపర్ స్టార్ మహేష్ కూడా తన తండ్రితో పోల్చుకోవడానికి ఇష్ట పడరు. ఆయన బయోపిక్ లో నటించండి అని అడిగితే అంత ధైర్యం తనకు లేదని ఓపెన్ గానే చెప్పేసారు. ఇంకా చాలామంది స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ పెద్ద వాళ్లతో పోలిక చేస్తే ఎంత మాత్రం అంగీకరించరు. కానీ శ్రుతి హాసన్ మాత్రం అలాంటి వాళ్లకు భిన్నమని తెలు స్తోంది. ప్రస్తుతం శ్రుతి హాసన్ తెలుగులో `సలార్ 2` లో నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కుతుంది. ఇది మినహా కొత్త చిత్రాలేవి కమిట్ అవ్వలేదు. తమిళ్ లో మాత్రం `ట్రైన్` అనే చిత్రంలో నటిస్తోంది. ఇది పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
