Begin typing your search above and press return to search.

నోటిలో సిగరెట్ తో శృతి హాసన్ బర్త్ డే స్పెషల్ పోస్టర్!

అదేంటంటే, ఈ చిత్రంలో గ్లామరస్ బ్యూటీ శృతి హాసన్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో మెరవబోతోంది.

By:  Madhu Reddy   |   28 Jan 2026 7:42 PM IST
నోటిలో సిగరెట్ తో శృతి హాసన్ బర్త్ డే స్పెషల్ పోస్టర్!
X

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు ఇంటి మనిషిలా మారిపోయారు. ముఖ్యం గా సీతారామం మూవీ తరువాత తెలుగులో దుల్కర్ సల్మాన్ అంటే తెలియనివారు వుండరు. గత ఏడాది 'కాంత' లాంటి పీరియాడికల్ డ్రామా తర్వాత ఆయన నటిస్తున్న లేటెస్ట్ ఫీల్-గుడ్ ఎంటర్టైనర్ 'ఆకాశంలో ఒక తార'. యువ దర్శకుడు పవన్ సాదినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి వెలువడిన ఒక సర్ప్రైజ్ అప్‌డేట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అదేంటంటే, ఈ చిత్రంలో గ్లామరస్ బ్యూటీ శృతి హాసన్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో మెరవబోతోంది.




ట్రైల్ బ్లేజింగ్ సైన్స్ టీచర్‌గా శృతి.. ఫస్ట్ లుక్ అదరహో:

శృతి హాసన్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి అధికారికంగా ధృవీకరించింది. ఇందులో శృతిహాసన్ కళ్లద్దాలు పెట్టుకొని, నోటిలో సిగరెట్ పెట్టుకొని భిన్నమైన లుక్ లో కనిపించింది. ఈ సినిమాలో ఆమె ఒక బోల్డ్ , ప్రోత్సాహకరమైన 'సైన్స్ టీచర్' పాత్రలో కనిపించబోతోంది. విడుదలైన పోస్టర్స్‌లో శృతి లుక్ చాలా కొత్తగా, కాన్ఫిడెంట్‌గా ఉంది. సాత్విక వీరవల్లి ఈ చిత్రంతో కథానాయికగా పరిచయం కానుంది. ఇక ఆమె తన కలలను నిజం చేసుకునే ప్రయాణంలో శృతి హాసన్ పాత్ర కీలక మలుపుగా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ఒక గురువుగా మార్గదర్శిగా శృతి ఇచ్చే స్ఫూర్తి ఈ సినిమాకే హైలైట్ కానుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.




పాన్ ఇండియా లెవల్లో నిర్మాణం:

ఇక దర్శకుడు పవన్ సాదినేని ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. లైట్ బాక్స్ మీడియా మరియు స్వప్న సినిమాస్ సంయుక్తంగా ఈ భారీ పాన్-ఇండియన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ క్రేజ్ దృష్టిలో ఉంచుకుని, అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ కథను సిద్ధం చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమాలోని విజువల్ గ్రాండియర్‌ను, ఎమోషనల్ డెప్త్‌ను చాటిచెప్పాయి. శృతి హాసన్ లాంటి స్టార్ నటి తోడవ్వడంతో ఈ ప్రాజెక్ట్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

'ఆకాశంలో ఒక తార' కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, కలలు కనే ప్రతి ఒక్కరికీ ఇదొక స్ఫూర్తిదాయకమైన కథ అని మేకర్స్ నమ్ముతున్నారు. దుల్కర్ సల్మాన్ స్క్రీన్ ప్రెజెన్స్, శృతి హాసన్ అనుభవం,పవన్ సాదినేని మేకింగ్ స్టైల్ అన్నీ కలిసి ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైన వెండితెర కావ్యంగా మార్చబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను మాయ చేయడం ఖాయంగా అని అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు. మరి ఈ సైన్స్ టీచర్ , ఆమె శిష్యురాలి ప్రయాణం ఎలా ఉండబోతుందో చూడాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.